అంగన్‌వాడీ టీచర్ల నుంచి లంచం డిమాండ్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
మెట్‌పల్లి, సెప్టెంబర్ 26: (E6tv NEWS: ప్రతినిధి)
అంగన్‌వాడీ టీచర్ల నుంచి రూ.63 వేల లంచం తీసుకుంటూ మెట్‌పల్లి ఐసీడీఎస్ సీడీపీవో పద్మ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని సీడీపీవో కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇటీవల మెట్‌పల్లి మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సీడీపీవో పద్మ తనిఖీ చేశారు. తనిఖీలకు సంబంధించిన రిపోర్టును అనుకూలంగా నమోదు చేసేందుకు అంగన్‌వాడీ టీచర్ల నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది.బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో శనివారం సీడీపీవో కార్యాలయంలో నిఘా ఏర్పాటు చేశారు. అంగన్‌వాడీ టీచర్ల నుంచి రూ.63 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ మధు ఆధ్వర్యంలోని అధికారులు సీడీపీవో పద్మను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం ఆమెను అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.


