Breaking News

డీఎస్ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులు

నిజామాబాద్, సెప్టెంబర్ 27,:(E6tv NEWS: ప్రతినిధి).

మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు, స్వర్గీయ డి. శ్రీనివాస్ (డీఎస్) జయంతి సందర్భంగా కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డి. శ్రీనివాస్‌ గారి సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాజకీయాల్లో డి. శ్రీనివాస్‌ తనదైన ముద్ర వేశారని, ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ప్రజలతో సన్నిహితంగా ఉంటూ, సామాన్యుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేసిన నాయకుడిగా డి. శ్రీనివాస్‌కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రాజకీయాల్లో ఆయన అనుసరించిన విలువలు, సేవా దృక్పథం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, డి. శ్రీనివాస్‌ గారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని స్వర్గీయ డి. శ్రీనివాస్‌ గారికి ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *