బోధన్ నుంచి జగిత్యాల వరకు 320 కి.మీ. సైకిల్ యాత్ర
బోధన్, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి).
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే డిమాండ్‌తో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బోధన్ నుంచి జగిత్యాల వరకు సుమారు 320 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా బోధన్‌లో నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వరి సాగుకు అవసరమైన సమయంలో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నిజాంసాగర్, అలీసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
రైతుల ప్రయోజనాల కోసం బీజేపీ, కిసాన్ మోర్చా నిరంతరం గళం విప్పుతుందని నాయకులు స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు, రుణమాఫీ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.




