Breaking News

కామారెడ్డి వద్దు.. నిజామాబాద్ ముద్దు

మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలో విలీనం చేయాలని ప్రజావాణిలో వినతి

జిల్లా మార్పుపై నివేదిక కోరుతూ అధికారులకు ఆదేశాలు జారీ

మద్నూర్, సెప్టెంబర్ 27: (E6tv NEWS: ప్రతినిధి)

మద్నూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లా నుంచి విడదీసి నిజామాబాద్ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ మద్నూర్ మండల ప్రజలు ప్రజావాణిలో వినతి సమర్పించారు. “కామారెడ్డి వద్దు.. నిజామాబాద్ ముద్దు” అంటూ తమ డిమాండ్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఆగస్టు 24న మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మస్కల్‌వార్ శివాజీ అప్ప ఆధ్వర్యంలో సుమారు 20 మంది వరకు ప్రజలు పాల్గొని మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.ఈ వినతిపై స్పందించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మస్కల్‌వార్ శివాజీకి సర్క్యులర్ కాపీ అందజేసినట్లు తెలిపారు. అలాగే బాన్సువాడ డివిజనల్ అధికారి, మద్నూర్ మండల తహసీల్దార్‌కు కూడా సర్క్యులర్ కాపీలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజల కోరిక మేరకు జిల్లా మార్పు అంశంపై నివేదిక సమర్పించాలని అధికారులను కోరినట్లు సమాచారం. దీంతో మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలో విలీనం చేయాలన్న ప్రజల డిమాండ్‌పై అధికారికంగా ప్రక్రియ ప్రారంభమైనట్లు స్థానికులు భావిస్తున్నారు.మద్నూర్ మండల ప్రజల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాన్ని పత్రికల్లో ప్రచురించి ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మస్కల్‌వార్ శివాజీ అప్ప విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *