భీమ్గల్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి)
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఎన్ఎస్యూఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ పిలుపునిచ్చారు. భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సయ్యద్ రెహమాన్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన మహనీయుడు భగత్ సింగ్ అని అన్నారు. ఆయన ధైర్యం, దేశభక్తి, త్యాగం నేటి యువతకు, విద్యార్థులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. మత్తు పదార్థాల కారణంగా ఆరోగ్యం, విద్య, కుటుంబ జీవితం, భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ వైపు యువత అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
“మత్తుకు దూరం.. లక్ష్యానికి చేరువ” అనే నినాదంతో ప్రతి విద్యార్థి తన జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని భగత్ సింగ్కు నివాళులు అర్పించారు.
