Breaking News

“దేవుళ్లను కూడా విడదీస్తున్నారు”: సీఎం రేవంత్ వ్యాఖ్యలు

ఢిల్లీలోని మీడియా కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తర-దక్షిణ భారతదేశ ప్రాంతీయ, ఆధ్యాత్మిక గుర్తింపులపై చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీశాయి. దక్షిణ భారతీయులమైన తాము ద్రావిడులమని, శివభక్తులమని, ఉత్తరాది ప్రజలు ఆర్యులు, రామభక్తులని పేర్కొన్న ఆయన, శివుడిని పేదల దేవుడిగా, రాముడిని ధనవంతుల దేవుడిగా అభివర్ణించారు. బీజేపీ కేవలం ‘జై శ్రీరామ్’ అని మాత్రమే నినాదాలు చేస్తోందని, ‘హర హర మహాదేవ్’ అని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను విభజించే కుట్రతోనే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. ప్రధాని మోదీ ‘జై శ్రీరామ్’తో పాటు ‘హర హర మహాదేవ్’ అని కూడా నినదిస్తారని చెబుతూ, లంకకు వెళ్లే ముందు శ్రీరాముడే స్వయంగా శివుడిని పూజించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలని బీజేపీ కౌంటర్ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *