– షేక్ మతిన్
రుద్రూర్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ నాయకుడు షేక్ మతిన్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని షేక్ మతిన్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
