నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించబడిన దివంగత రామ్‌రెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఆయన పోటీ నుండి వైదొలిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాను ఎవరినీ టికెట్ కావాలని అడగలేదని, టీపీసీసీ ప్రకటించిన జాబితాలో తన పేరు చూసి తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యానని ఆయన తన అనుచరులతో పేర్కొన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా లేనని సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ కీలక పరిణామంతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలినట్లయింది.
