Breaking News

ధర్మవరంలో ఘనంగా స్వచ్ఛత హి సేవ

ధర్మవరంలో ఘనంగా స్వచ్ఛత హి సేవ

పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మార్కెట్‌ను శుభ్రం చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

ధర్మవరం, అక్టోబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి)

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి మార్కెట్ పరిసరాల్లోని చెత్తను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు.

స్వచ్ఛ ధర్మవరం నిర్మాణానికి కృషి

ధర్మవరం పట్టణాన్ని స్వచ్ఛ ధర్మవరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు స్వచ్ఛత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పట్టణంలో పరిశుభ్రతను కాపాడటం ప్రభుత్వంతో పాటు ప్రజలందరి బాధ్యత అని పేర్కొన్నారు.

స్వచ్ఛ ధర్మవరం నిర్మాణం ప్రజలందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు, సామాజిక సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ధర్మవరం పట్టణాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *