Breaking News

నర్సింగ్ విద్యార్థిని హరిణి మృతి వెనుక…ప్రియుడే హంతకుడు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న పవన్ కుమారే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. పవన్ చెడు అలవాట్ల కారణంగా హరిణి అతడిని దూరం పెట్టడం, పెళ్లికి నిరాకరించడంతో పాటు ఆమె మరొకరితో సన్నిహితంగా ఉందనే అనుమానంతో పవన్ కక్ష పెంచుకున్నాడు.

గత నెల 22న హరిణి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్లిన పవన్, పెళ్లి విషయమై గొడవపడి వెంట తెచ్చుకున్న బైక్ క్లచ్ వైర్‌తో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మరుగుదొడ్డి వద్ద పడేసి పారిపోయాడు. నిందితుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి విశాఖపట్నం, తిరుపతి పారిపోయి, తిరిగి తన బైక్ కోసం ఖమ్మం రాగా.. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *