టాలీవుడ్ నటుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తన అర్ధాంగి లావణ్య త్రిపాఠి, కుమారుడు వాయువ్తో కలిసి స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చిన్నారి వాయువ్ను వరుణ్ తేజ్ ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పర్యటనలో వరుణ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజతో పాటు సోదరి నిహారిక కోణిదెల కూడా పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల తమ కుమారుడి మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ జంట సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పంచుకున్న విషయం తెలిసిందే.
ఇక వరుణ్ తేజ్ సినీ కెరీర్ విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ యధు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారీ’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. గ్రామీణ వాలీబాల్ క్రీడ నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ఆయన సోదరి నిహారిక కోణిదెల నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ చిత్ర ప్రారంభోత్సవం నిమిత్తం అనుదీప్ దేవ్ స్వరాలు అందిస్తుండగా, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
