Breaking News

అనంతగిరి ఘాట్ రోడ్డు వద్ద బస్సు బోల్తా…

వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డు సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన సుమారు 54 మంది ప్రయాణికులు వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం చింతకుంట గ్రామంలో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అనంతగిరి కొండల నుంచి కిందకు దిగుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నివారణ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *