యశోద హాస్పిటల్స్‌లో సమగ్ర క్యాన్సర్ వైద్య సేవలు
కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, CAR-T సెల్ థెరపీకి అవకాశం
నిజామాబాద్: అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)
క్యాన్సర్ రోగుల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక వైద్య సాంకేతికతతో సమగ్ర చికిత్స అందించేందుకు యశోద హాస్పిటల్స్‌లోని క్యాన్సర్ విభాగం సేవలు అందిస్తోంది. ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితి, క్యాన్సర్ రకం, వ్యాధి దశ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత చికిత్స ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
క్లిష్టమైన క్యాన్సర్ కేసుల్లో వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు కలిసి రోగి పరిస్థితిని సమీక్షించి చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తున్నట్లు పేర్కొన్నారు. కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, CAR-T సెల్ థెరపీ వంటి ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.రోగుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని డే-కేర్ కీమోథెరపీ సేవలను కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్‌కు సంబంధించిన అత్యవసర పరిస్థితులను నిర్వహించడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో రోబోటిక్ సర్జరీ, HIPEC వంటి ఆధునిక చికిత్సా విధానాలను కూడా వినియోగిస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ – మెడికల్ ఆంకాలజీ & హీమటాలజీ డాక్టర్ భరత్ ఏ. వస్వని, MD, DM మాట్లాడుతూ… క్యాన్సర్ ప్రతి రోగిలో ఒకే విధంగా ఉండదని, అందువల్ల రోగి పరిస్థితి, క్యాన్సర్ రకం, వ్యాధి దశ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి వ్యక్తిగత చికిత్సా ప్రణాళిక రూపొందించడం ముఖ్యమని తెలిపారు. ఆధునిక వైద్య సాంకేతికతతో పాటు వివిధ విభాగాల నిపుణుల సమన్వయంతో రోగులకు అవసరమైన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సరైన సమయంలో నిపుణుల వైద్య సలహా తీసుకోవడం ద్వారా చికిత్సా అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని డాక్టర్ భరత్ ఏ. వస్వని సూచించారు.

— E6TV NEWS
