Breaking News

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ నిర్మల్ నియోజకవర్గ చైర్మన్ కత్తి నరేందర్‌కు ఘన సన్మానం

నిర్మల్, అక్టోబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి).
నిర్మల్ జిల్లాలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ నిర్మల్ నియోజకవర్గ చైర్మన్, కాంగ్రెస్ కౌన్సిలర్ కత్తి నరేందర్‌ను మాదిగ ఎంప్లాయీస్ నిర్మల్ జిల్లా ప్రతినిధులు, కాలనీ మైనార్టీ మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కత్తి నరేందర్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కత్తి సురేష్, ఉప్పిరి రవి, చందుల చందు, సుభాన్‌తో పాటు స్థానిక ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.కత్తి నరేందర్‌కు తమ మద్దతు, అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *