Breaking News

శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కన్వీనర్‌గా రాచర్ల రామకృష్ణ

చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)

శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ కన్వీనర్‌గా చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన జర్నలిస్టు రాచర్ల రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎం.ఎస్.పి. రాష్ట్ర మాజీ అధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా ఇన్‌చార్జి బాయకాటి బెనర్జీ ప్రకటించారు.

శనివారం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఆవరణలో చెన్నేకొత్తపల్లి మండల ఎం.ఆర్.పి.ఎస్. అధ్యక్షులు అర్జునప్ప మాదిగ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలకు చెందిన ఎం.ఆర్.పి.ఎస్., ఎం.ఎస్.పి. నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం.ఎస్.పి. రాష్ట్ర మాజీ అధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా ఇన్‌చార్జి బాయకాటి బెనర్జీ, జిల్లా కో-ఇన్‌చార్జిలు కుంచం నాగభూషణం మాదిగ, ఆదినారాయణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 6న హైదరాబాద్‌లో జరగనున్న విద్యార్థుల సమావేశం, ఈ నెల 17న అమరావతిలో ఎం.ఆర్.పి.ఎస్., ఎం.ఎస్.పి. విభాగాల ఆధ్వర్యంలో జరగనున్న సమావేశాలపై చర్చించారు. అలాగే మూడు మండలాల్లోని గ్రామ కమిటీల ఏర్పాటు, కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎం.ఆర్.పి.ఎస్. జాతీయ అధికార ప్రతినిధి విశ్వనాథ్ మాదిగ అనుమతితో, బాయకాటి బెనర్జీ సమక్షంలో రాచర్ల రామకృష్ణను శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా: రాచర్ల రామకృష్ణ

జిల్లా కన్వీనర్‌గా ఎన్నికైన రాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకం, గౌరవం, అభిమానంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎం.ఆర్.పి.ఎస్. వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేసే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తన శక్తి సామర్థ్యాల మేరకు మందకృష్ణ మాదిగ ఆశయాలకు అనుగుణంగా పట్టుదలతో పనిచేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాయకాటి బెనర్జీ, కుంచం నాగభూషణం మాదిగ, ఆదినారాయణ మాదిగ, రాచర్ల రామకృష్ణ మాదిగ, చెన్నేకొత్తపల్లి మండల ఎం.ఆర్.పి.ఎస్. గౌరవ అధ్యక్షులు టోపీ ముత్యాలప్ప మాదిగ, మండల అధ్యక్షులు అర్జునప్ప మాదిగ, ఎం.ఎస్.పి. మండల అధ్యక్షులు లింగయ్య మాదిగ, రామాంజినేయులు మాదిగ, రామగిరి ఎం.ఎస్.పి. మండల అధ్యక్షులు నాగరాజు మాదిగ, కనగానపల్లి మండల ఎం.ఆర్.పి.ఎస్. అధ్యక్షులు చందు మాదిగ, ఎం.ఎస్.పి. మండల అధికార ప్రతినిధి నరసింహమూర్తి, ధర్మవరం టౌన్ ఎం.ఎస్.పి. అధ్యక్షులు యాదగిరి మాదిగ, ఎం.ఆర్.పి.ఎస్. టౌన్ అధ్యక్షులు నరసింహాలు, ఎం.ఆర్.పి.ఎస్. కన్వీనర్ పుల్లయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *