Breaking News

పశ్చిమ ఆసియా:యెమెన్‌లో భారీ దాడులు

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే లక్ష్యంతో యెమెన్ ప్రభుత్వం వారిపై భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభించగా, దానికి ప్రతిగా సౌదీ అరేబియాలోని ‘సౌదీ అరామ్‌కో’ లక్ష్యాలుగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి దౌత్య పరిష్కారానికి మొగ్గు చూపుతూనే, అవసరమైతే కఠిన ప్రతిస్పందనకు సిద్ధమని హెచ్చరించారు. రెడ్ సీ, బాబ్ ఎల్-మండేబ్ వంటి కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో ఈ పోరు తీవ్రమైతే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి, ఎగుమతులు-దిగుమతుల ఖర్చులతో భారత్ వంటి దేశాలపై ద్రవ్యోల్బణ భారం పడే ముప్పు ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *