Breaking News

రూ.23.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గోదావరి పుష్కరాల పనులతో పాటు రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణానికి శ్రీకారం

నిర్మల్‌, అక్టోబర్‌ 05:(E6tv NEWS: ప్రతినిధి).

జిల్లాలో రూ.23.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు సోమవారం శంకుస్థాపన చేశారు. నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్‌, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రాతో కలిసి అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు.వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించిన రహదారుల నిర్మాణ పనులతో పాటు రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణ పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

మంత్రులకు ఘన స్వాగతం

జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం నిర్మల్‌ చేరుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల ఉన్నతాధికారులు డి.ఎస్. లోకేష్‌కుమార్‌, రాజీవ్‌గాంధీ హనుమంతు, వి.పి. గౌతమ్‌లకు జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, అధికారులు జిల్లా కలెక్టరేట్‌లో ఘన స్వాగతం పలికారు.కలెక్టర్‌ మంత్రులు, ఉన్నతాధికారులకు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత మంత్రులు, ఉన్నతాధికారులు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల కలెక్టర్లు భవేశ్‌ మిశ్రా, రాజర్షి షా, హరిత, అదనపు కలెక్టర్లు రాథోడ్‌ రమేష్‌, ఆర్‌.ఎస్‌. చిత్రు, చంద్రయ్య, రాములు, డేవిడ్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్‌, ముధోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఉట్నూర్‌ ఐటీడీఏ పీఓ మంద మకరందు, సబ్‌ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *