వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి రూ.30,156 కోట్ల అంచనా వ్యయంతో 90 లక్షల కుటుంబాలకు సురక్షిత తాగునీరు అందించే ‘అమరజీవి జలధార’ (జల్ జీవన్ మిషన్ 2.0) పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. గత వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల సుపారీ గుట్టు విప్పాక అంతిమ లబ్ధిదారు ఎవరో తేలిపోయిందని, దీనిపై జగన్ రెడ్డికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని నిలదీశారు. అలాగే వేల కోట్ల లిక్కర్ స్కామ్, ఇసుక దోపిడీపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం రాయలసీమను హార్టికల్చర్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
వివేకా హత్య, లిక్కర్ స్కామ్‌పై చంద్రబాబు ఛాలెంజ్!

