పశ్చిమ బెంగాల్‌లో విమానయాన రంగాన్ని వేగవంతంగా విస్తరించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూలంగా కొత్త ‘సివిల్ ఏవియేషన్ పాలసీ’ని రూపొందించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో పురూలియా (చర్రా), పశ్చిమ మేదినీపూర్ (కాలైకుండ), దక్షిణ దినాజ్‌పూర్ (బాలూర్‌ఘాట్), అలీపుర్‌దువార్ (హసిమారా) ప్రాంతాల్లో నాలుగు కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. నగరంలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా కోల్‌కతాకు రెండో ఎయిర్‌పోర్ట్ అవసరమని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి, ‘ఉడాన్’ (UDAN) పథకం కింద వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో రూ.29 వేల కోట్లు ఖర్చు చేసేందుకు బెంగాల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
