జీరో ఫాటాలిటీ జిల్లాలే లక్ష్యం: ప్రమాద ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నిర్మల్, అక్టోబర్ 7 (E6tvNEWS: ప్రతినిధి)
రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతను మెరుగుపరచడం, జీరో ఫాటాలిటీ జిల్లాల సాధనే లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ (HoPF) ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇళంబరిది పాల్గొని రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయం (DPO) నుంచి జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లు, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన తదితర ప్రమాద కారణాలపై సమీక్షించారు.
జీరో ఫాటాలిటీ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రమాదాలకు దారితీస్తున్న ప్రధాన కారణాలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో సూచించారు. రోడ్డు భద్రత కోసం పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. Safe Life Foundation – MARGDARSHAK వెబ్‌సైట్‌లో రోడ్డు ప్రమాదాలు, బ్లాక్ స్పాట్లు, రహదారి భద్రతకు సంబంధించిన వివరాలతో పాటు చేపడుతున్న నివారణ చర్యలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.
Safe Life Foundation – MARGDARSHAK వెబ్‌సైట్‌లో రోడ్డు ప్రమాదాలు, బ్లాక్ స్పాట్లు, రహదారి భద్రతకు సంబంధించిన వివరాలతో పాటు చేపడుతున్న నివారణ చర్యలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు.

