Breaking News

రాహుల్ గాంధీపై లాఠీచార్జిని నిరసిస్తూ రాస్తారోకో

కమ్మర్‌పల్లిలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన

కమ్మర్‌పల్లి, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి) ఢిల్లీలో ఓటు చోరీ అంశంపై జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నాయకులపై లాఠీచార్జి జరిగిందని ఆరోపిస్తూ కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఓటు చోరీ అంశంపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్న రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నాయకులపై లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఈ కార్యక్రమంలో కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భువనగిరి భాస్కర్, భీంగల్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, భీంగల్ టౌన్ అధ్యక్షుడు పరస అనంతరావు, మోర్తాడ్ మండల అధ్యక్షుడు ఆనంద్, కమ్మర్‌పల్లి పట్టణ అధ్యక్షుడు సల్లూరి గణేష్ గౌడ్, భీంగల్ పట్టణ అధ్యక్షుడు అనంతరావు, బాల్కొండ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు రిక్విత్ తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *