Breaking News

మహిళా గ్రామ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ

నాణ్యతలో రాజీ లేకుండా పనులు చేపట్టాలి: ఎంపీడీవో సంతోష్ కుమార్

భీమ్‌గల్, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి)

భీమ్‌గల్ మండలం సంతోష్‌నగర్ తండా గ్రామంలో మహిళా గ్రామ సంఘం భవన నిర్మాణానికి గురువారం ఎంపీడీవో సంతోష్ కుమార్ భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గతంలో గ్రామ సంఘ భవనాల నిర్మాణ పనులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టేవారని తెలిపారు. ప్రస్తుతం సంబంధిత నిర్మాణ పనులను VBGRAM-G టెక్నికల్ సిబ్బంది పర్యవేక్షణలో చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు.అనంతరం గ్రామంలో చేపడుతున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ పనులను ఎంపీడీవో పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా గ్రామంలో ఇంకుడు గుంతలు, ఫారం ఫండ్ పనులను పెద్ద సంఖ్యలో ప్రారంభించి, స్థానిక కూలీలకు మరింత ఉపాధి కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి ప్రజలకు ఉపయోగపడేలా పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, టౌన్ అధ్యక్షుడు పరస అనంతరావు, ఏపీవో జీ. నర్సయ్య, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్, టెక్నికల్ అసిస్టెంట్లు స్వామిదాస్, గణేష్, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘాల ప్రతినిధులు, ఐకేపీ సీసీలు గంగాధర్, గంగ సాయిలు పాల్గొన్నారు.గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *