రూ.790.38 కోట్లతో పనులు ప్రారంభం
పెనుకొండ, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి).
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామ సమీపంలో హంద్రీ-నీవా సుజల స్రవంతి మడకశిర ఉపకాలువ సామర్థ్యం పెంపు పనులకు భూమిపూజ నిర్వహించారు. రూ.790.38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా కాలువ నీటి సామర్థ్యాన్ని ప్రస్తుత 408 క్యూసెక్కుల నుంచి 642 క్యూసెక్కులకు పెంచనున్నారు.
ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్థసారథి, మంత్రి సవిత, యువ నాయకుడు బీకే సాయి కళ్యాణ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కాలువ సామర్థ్యం పెంపు పనులు పూర్తయితే మడకశిర ప్రాంతానికి సాగునీటి సరఫరా మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని, రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఈ ప్రాజెక్టుపై ఆశాభావం వ్యక్తమవుతోంది. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం ద్వారా రైతులకు సాగునీటి ప్రయోజనాలు అందించాల్సిన అవసరం ఉంది.


