Breaking News

పెట్టుబడులలో కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఏపీ!

ఆంధ్రప్రదేశ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగం పెంచారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ సదస్సుకు ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

జూన్ 2024 నుండి ఇప్పటివరకు రూ. 22.6 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని, వీటి ద్వారా 7.1 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, రాయలసీమలో హార్టికల్చర్ హబ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఏపీని ప్రగతిపథంలో తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.

జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి సుమారు రూ. 22.6 లక్షల కోట్ల విలువైన 714 భారీ ప్రాజెక్టులు వచ్చాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏపీలోని యువతకు ఏకంగా 7.1 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికత ఆధారిత పారదర్శక పాలనతో వ్యాపార అనుమతులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, అమరావతిలో క్వాంటం వ్యాలీ, మరియు గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నామని వివరించారు. వేగం, విస్తరణ, స్థిరత్వమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వాములై రాష్ట్ర వికాసంలో పాలుపంచుకోవాలని ప్రపంచ పారిశ్రామికవేత్తలను సీఎం కోరారు. విశాఖపట్నంలో జరగబోయే ఈ సీఐఐ సదస్సు ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *