Breaking News

వీసా వివాదం: యుఎస్ వైస్ ప్రెసిడెంట్‌కు భారత్ కౌంటర్!

అమెరికా హెచ్-1బి (H-1B) వీసాదారులు, విదేశీ నిపుణులను ఉద్దేశించి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ Vance చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. H-1B వీసా కార్మికులను “వెట్టిచాకిరీ చేసే బానిసలు” (Indentured Servants) అంటూ ఆయన అభివర్ణించడాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఈ తరహా వ్యాఖ్యలు “తీవ్ర ఆక్షేపణీయం” అని, బాధాకరమైన వలసరాజ్యాల కాలం నాటి మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయని స్పష్టం చేసింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక మరియు ఆవిష్కరణల రంగానికి భారతీయ నిపుణులు అందిస్తున్న అసమాన సేవలను, వారి అత్యున్నత విద్యార్హతలను విస్మరించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం తగదని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, విప్రో, హెచ్‌సిఎల్ సహా ప్రముఖ ఐటీ దిగ్గజాలపై అమెరికా ప్రభుత్వం PERM (గ్రీన్ కార్డ్ లేబర్ సర్టిఫికేషన్) ప్రక్రియకు సంబంధించి ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాలో ఉపాధి పొందుతున్న భారతీయుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు తాము నిరంతరం కట్టుబడి ఉన్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *