మోర్తాడ్, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).
నిజామాబాద్ జిల్లా స్థాయిలో నిర్వహించిన పోషణ మాసం–2026 కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం, మోర్తాడ్ మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్ జ్యోతి ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా అవార్డు అందుకున్నారు. అంగన్వాడీ సేవల్లో ఆమె అందిస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును జడ్జి ప్రదానం చేశారు.
చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, గర్భిణులు, బాలింతల సంక్షేమం, పిల్లల ఎదుగుదలకు సంబంధించిన కార్యక్రమాల అమలులో అంగన్వాడీ టీచర్ల పాత్ర ఎంతో కీలకమైనది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు అందుకోవడం పట్ల జ్యోతి కి పలువురు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎల్సీసీ సెక్రటరీ నీలిమ, సీడీపీఓ జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ అవార్డు అందుకున్న జ్యోతి అక్క స్వామికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
