హైదరాబాద్ (e6tv news): ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయంటూ, పారదర్శకత లేని విధానాలను నిరసిస్తూ హైదరాబాద్లోని ఎల్బీనగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టనున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నాయకత్వంలో జరిగే ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాలరాస్తూ, అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నా నేపథ్యంలో ఎల్బీనగర్ జంక్షన్ పరిసరాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భద్రతతో పాటు ట్రాఫిక్ నివారణ చర్యలను ముమ్మరం చేశారు.


