Breaking News

రేపు ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటన

మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవాలు.. పలు గ్రామాల్లో జెండా కార్యక్రమాలు

ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (E6tv NEWS ప్రతినిధి).

ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ బుధవారం, అక్టోబర్ 14న ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ పర్యటనలో మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవాలతో పాటు పలు గ్రామాల్లో జెండా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవాలు

కొక్కొండ, లక్ష్మాపూర్, బిక్కనూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మహిళా సంఘాల భవనాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించనున్నారు.

పలు గ్రామాల్లో జెండా కార్యక్రమాలు

హాజీపూర్, అజామాబాద్, అడివిలింగాల, వెల్లుట్ల, అడివిలింగాల తండా, వెంకటాపూర్, కళ్యాణి, వెల్లుట్లపేట గ్రామాల్లో నిర్వహించే జెండా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొంటారు.అనంతరం వివిధ కారణాలతో గాయపడినవారిని, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలకు నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *