హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా ప్రారంభమైన ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్-2026’ సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జాతీయ జీడీపీలో ప్రస్తుతం 5 శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ‘CURE, PURE, RARE’ త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని, అభివృద్ధి విషయంలో అందరూ పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.
