Breaking News

తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారనుండటంతో అక్టోబర్ 15 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల కొన్ని రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకునే రైతులు కోతకు సిద్ధంగా ఉన్న పంటలను, ఆరబెట్టిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *