Breaking News

జనసేనలో వంగవీటి రాధా.. విజయవాడ మేయర్ రేసులో బిగ్ ట్విస్ట్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. అమరావతిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరుణంలో ఆయన పార్టీ మారడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

  • విజయవాడ మేయర్ రేసులో రాధా పేరు: ఈ పరిణామాతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ బరిలో దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విజయవాడ మేయర్ స్థానం అన్‌రిజర్వ్‌డ్ జనరల్ కేటగిరీ కింద కేటాయించడంతో పాటు, రాధాకు నగరంలో ఉన్న బలమైన అనుచరగణం, చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన తరఫున ఆయనను రంగంలోకి దించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
  • కూటమిలో సీట్ల సర్దుబాటు: మరోవైపు స్థానిక ఎన్నికల్లో భాగంగా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. విజయవాడలోని మొత్తం 86 డివిజన్లలో 35 స్థానాలు తమకు కేటాయించాలని జనసేన కోరుతున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా విజయవాడ మేయర్ పీఠాన్ని జనసేన దక్కించుకుంటుందా లేదా అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *