Breaking News

ఎల్లారెడ్డిలో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

యువతకు కలాం జీవితం స్ఫూర్తిదాయకం

దేశ రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆయన సేవలు చిరస్మరణీయం

ఎల్లారెడ్డి, అక్టోబర్ 15 (E6tv న్యూస్).

మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఎల్లారెడ్డి పట్టణంలోని గ్రంథాలయంలో బహుజనుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి డాక్టర్ అబ్దుల్ కలాం అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సాధారణ కుటుంబంలో జన్మించి తన కృషి, పట్టుదల, ప్రతిభతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

పలువురు ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు శంకరన్న, జిల్లా బీసీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు లింగమయ్య, బహుజన నాయకుడు సాయిబాబు, గ్రంథాలయ అధికారి ఎం.ఏ. జాకీర్, ఎస్.కె. సలీమ్ ఉద్దీన్, ఎఫ్.కె. కమరుద్దీన్, బంజారా సంఘం మండల ప్రధాన కార్యదర్శి సర్దార్ నాయక్, ఫుల్ సింగ్, లోకేష్ గౌడ్, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *