Breaking News

పలు అమ్మవారి మండపాలను సందర్శించిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, అక్టోబర్ 16 (E6 న్యూస్ ప్రతినిధి).

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని పలు అమ్మవారి మండపాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్ సందర్శించారు. శ్రీరామ్ నగర్, శివాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయా మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేవీ శరన్నవరాత్రులు ప్రజల జీవితాల్లో సంతోషం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *