బోధన్, అక్టోబర్ 19: (E6tv NEWS: ప్రతినిధి).
దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 46 మందికి ట్రై సైకిళ్లు అందజేయడం గర్వకారణమని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. శాల గంగాధర్ అన్నారు.లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3200, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ చారిటబుల్ ట్రస్ట్, పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 46 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శాల గంగాధర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల జీవితాల్లో కొంతైనా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేపట్టిన మూడు సంస్థల ప్రతినిధులకు, నాయకులకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బసవేశ్వరరావు, సూర్యనారాయణరావు, విలేకర్ ప్రకాష్, జీస్ పాలూరు, డానియల్, చిట్టెం, రాజేందర్ ప్రసాద్ తదితరులు చేసిన సేవలను అభినందించారు.
రాబోయే రోజుల్లో కూడా స్వచ్ఛంద సంస్థలు మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు అండగా నిలవాలని ఆయన కోరారు. సమాజంలోని అణగారిన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సేవా సంస్థలు ముందుకు రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో NPRD నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గైని రాములు, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్, లక్ష్మణ్, దేవదాస్, బీరుగొండ, నాగనాథ్ పటేల్, సంటోల లక్ష్మి, సోనీ, జయరాం, సిందే గంగాధర్, కట్టమీది గంగాధర్, రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
