Breaking News

మోపాల్‌లో దుర్గామాత ఉత్సవ సమితి నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

మోపాల్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: శివ ఠాకూర్).

మోపాల్ గ్రామంలో శనివారం దుర్గామాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దుర్గామాత ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు, గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో నూతన షెడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భూమిపూజ చేశారు. దుర్గామాత ఉత్సవాలను ప్రతిఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, ఉత్సవాల సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.నూతన షెడ్డు నిర్మాణంతో ఉత్సవాల సమయంలో భక్తులకు మరింత సౌకర్యం కలగడంతో పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. భూమిపూజ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో సవీన్ రెడ్డి, శోభన్ బాబు, రామ గౌడ్, నవనీత్ రెడ్డి, సతీష్, అశోక్, నవీన్ రెడ్డి, సుమన్, మహేందర్, గంగారెడ్డి, లచ్చా రెడ్డి, సాయిలు, సాగర్, శేఖర్తో పాటు దుర్గామాత సేవా సమితి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *