Breaking News

బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణిపై కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు!

రూ.5 లక్షల నగదు మోసం, సినీ ఫైనాన్షియర్‌ను బెదిరించిన కేసులో మోడల్, ‘బిగ్‌బాస్’ ఫేమ్ వర్షిణి వెంకట్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వరుణ్ అనే సినీ ఫైనాన్షియర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గిండి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే… ఓ షార్ట్ ఫిలిం నిర్మాణం కోసం వర్షిణి తన వద్ద డబ్బులు అడగ్గా వరుణ్ నిరాకరించారు. దీంతో ఆమె తన స్నేహితులతో కలిసి వరుణ్ ఉన్న హోటల్ గదికి వచ్చి, అతడితో ఉన్న ఫొటోలు చూపిస్తూ బెదిరింపులకు దిగింది. భయపడిన వరుణ్ ఆ రోజు రూ.50 వేలు ఇచ్చి పంపేశారు.

అంతటితో ఆగకుండా, తనతో సన్నిహితంగా ఉన్నందుకు రూ.3 లక్షలు, ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన స్నేహితుడు సంజయ్‌కు రూ.2 లక్షలు ఇవ్వాలని వర్షిణి మళ్లీ ఫోన్ చేసి బెదిరించింది. వివాదం పెద్దది కాకుండా ఉండేందుకు వరుణ్ ఆమె అడిగిన రూ.5 లక్షలను బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. అయినప్పటికీ, రెండు రోజుల క్రితం మరోసారి రూ.27 లక్షలు ఇవ్వాలని తీవ్ర బెదిరింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

విచారణలో వర్షిణి ఆమె స్నేహితులతో కలిసి మోసానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె స్నేహితులు వెంకట్, సంజయ్‌లతో పాటు మరొకరి కోసం గాలిస్తున్నారు. కాగా, వర్షిణి తమిళనాడులోని ‘టీవీకే’ పార్టీ మహిళా కార్యకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *