Breaking News

నవంబర్ నుంచి చింతలపూడి పనులు: చంద్రబాబు

రాష్ట్రంలోని కీలకమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను ఈ ఏడాది నవంబర్ నుంచి తిరిగి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అవసరమైన పర్యావరణ అనుమతులు ఇప్పటికే ఉన్నందున పనులు వెంటనే మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికల పనులతో రాజకీయంగా తీరిక లేకుండా ఉన్నప్పటికీ, శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో గుర్తించిన 36…

Read Full News

‘గుంజకు కట్టి కొట్టినా తప్పులేదు’: కేసీఆర్‌పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని రూ. లక్ష కోట్ల భారీ అవినీతికి కేసీఆర్ డిజైన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణానికి సూత్రధారి ప్రతిమా శ్రీనివాస్ అని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడైనా ముడిసరుకు లభించే ప్రాంతంలోనే పరిశ్రమలు స్థాపిస్తారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం బొగ్గు లభించే చోట కాకుండా కృష్ణా నదీ పరీవాహక ప్రాంతమైన దామరచర్లలో యాదాద్రి ప్లాంట్‌ను…

Read Full News

రాజకీయాల్లోకి బొత్స కోడలు పూజిత.. గరివిడి జడ్పీటీసీ అభ్యర్థిగా !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తన కుటుంబం నుంచి మరో రాజకీయ వారసురాలిని రంగంలోకి దించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తన కోడలు బొత్స పూజితను విజయనగరం జిల్లా గరివిడి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుతూ బొత్స సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా ఓటర్లకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకితమై…

Read Full News

తుమ్మిడిహట్టి బ్యారేజీపై సీఎం రేవంత్ సమీక్ష

రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో జరగనున్న చర్చలకు పూర్తిగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా తుమ్మిడిహట్టి, దిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలపై చర్చించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే అవకాశం…

Read Full News

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బేటీ జన్మోత్సవ్’ కార్యక్రమం

ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించాలి – బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలి బోధన్, అక్టోబర్ 24:(E6tv NEWS). బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బేటీ జన్మోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు శిశువుల సంరక్షణకు అవసరమైన బేబీ ప్రొడక్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విద్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాహుల్, ఐసీడీఎస్ బోధన్…

Read Full News

సంజీవ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఎల్లారెడ్డి, అక్టోబర్ 23 (E6tv న్యూస్) లింగంపేట్ మండలం మాలపాటి గ్రామానికి చెందిన సంజీవ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందడంతో, శుక్రవారం నిర్వహించిన దినకర్మ కార్యక్రమం సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వారి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంజీవ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ…

Read Full News

బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి జైలు శిక్ష

పోక్సో కేసులో ఏడేళ్ల జైలు.. రూ.20 వేల జరిమానా నిజామాబాద్, అక్టోబర్ 23 (E6tv న్యూస్). బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ నిజామాబాద్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ జడ్జి దుర్గాప్రసాద్ తీర్పు ఇచ్చినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021 సెప్టెంబర్‌లో నిజామాబాద్‌లోని ఒక ప్రాంతంలో ఐదేళ్ల…

Read Full News

ఆర్మీ జవాన్లకు అండగా నిలిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకారం.. ఎమ్మెల్యేకు, గ్రామ పెద్దలకు జవాన్ల కృతజ్ఞతలు అక్బర్ నగర్, అక్టోబర్ 23 (E6tv న్యూస్). దేశ రక్షణలో నిరంతరం సేవలందిస్తున్న ఆర్మీ జవాన్లకు అండగా నిలిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులకు అక్బర్ నగర్ గ్రామానికి చెందిన జవాన్లు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన సుమారు 10 నుంచి 20 మంది వరకు ఆర్మీ జవాన్లు దేశ…

Read Full News

విమర్శలకు మౌనమే సమాధానం.. ప్రజాసేవే పోచారం బలం!

బాన్సువాడ రాజకీయాల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక శైలి.. తండ్రి బాటలో తనయులు బాన్సువాడ, అక్టోబర్ 23 (E6tv న్యూస్). రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే ఎన్ని విమర్శలు ఎదురైనా సంయమనంతో వ్యవహరించడం, ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగడం తన రాజకీయ శైలిగా భావించే నాయకుల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకరని ఆయన అనుచరులు, అభిమానులు చెబుతున్నారు. ప్రత్యర్థుల వ్యాఖ్యలకు వెంటనే స్పందించకుండా మౌనంగా ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉండటానికే ప్రాధాన్యత…

Read Full News

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి వ్యాసరచన పోటీలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి వ్యాసరచన పోటీలు ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం ఎల్లారెడ్డి, అక్టోబర్ 23 (E6tv న్యూస్). పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్లారెడ్డి పోలీస్ సర్కిల్ పరిధిలోని సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వ్యాసరచన పోటీల్లో ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం…

Read Full News