Breaking News
తెలంగాణ కేబినెట్‌లోకి రాములమ్మ?: కొండా సురేఖ స్థానంలో విజయశాంతికి ఛాన్స్!
హైదరాబాద్: మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌తో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం సీతక్క ఒక్కరే మహిళా మంత్రిగా ఉండటంతో, సురేఖ స్థానంలో మరొక మహిళా నేతను కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ రేసులో ఫైర్‌బ్రాండ్ నాయకురాలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేసులో పలువురు నేతలు – విజయశాంతికే మొగ్గు?: యశస్వినీ రెడ్డి (పాలకుర్తి), పద్మావతి రెడ్డి (కోదాడ),…
ఒకే అమ్మాయిని ప్రేమించిన స్నేహితులు: ప్రియుడిని మద్యం తాగించి చంపేసిన కిరాతకుడు!
రీవా (మధ్యప్రదేశ్): ఒకే యువతిని ప్రేమించామనే కారణంతో, నిన్నటి వరకు ఆత్మీయ మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా మారారు. స్నేహం పేరిట నమ్మించి, మద్యం తాపి ప్రాణస్నేహితుడినే నరికి చంపిన ఘోర సంఘటన మధ్యప్రదేశ్ రీవా జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఘటన నేపథ్యం & కిరాతక పథకం: రీవా జిల్లా దుఆరి పిప్‌రహా గ్రామానికి చెందిన మొహమ్మద్ ఇస్రార్ (30), అతడి మిత్రుడు ఆశిష్ కోల్ ఇద్దరూ కొన్నాళ్లుగా ప్రాణస్నేహితులు. అయితే, వీరిద్దరూ ఒకే మహిళను ప్రేమించడంతో…
శిరీష హత్యాచార ఘటనపై నిందితుడిని కఠినంగా శిక్షించాలి
కొవ్వొత్తుల ర్యాలీ, మానవహారం నిర్వహించిన ఇల్లందు కాంగ్రెస్ శ్రేణులు ఇల్లందు: హైదరాబాద్‌లోని ప్రైమ్ కేర్ హాస్పిటల్‌లో నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఊకే శిరీష పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి జగదాంబ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగదాంబ…
ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం: గణేష్ బిగాల
నిజామాబాద్, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ బైక్ ర్యాలీ సెప్టెంబర్ 5న ఉదయం 10:30 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభం కానుంది. యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఎన్నికల సమయంలో…
బల్దియా ఉద్యోగుల మెడకు అవుట్సోర్సింగ్ ఉచ్చు!
జమ్మికుంట, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి).జమ్మికుంట బల్దియా ఉద్యోగుల మెడకు అవుట్సోర్సింగ్ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునేందుకు అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఉద్యోగుల వ్యవహారాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు, గతంలో జరిగిన వ్యవహారాలపై అధికారులు ఆరా…
ఇంకా నిరుపేదలు ఉన్నారు.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న మరో 10 మంది పేదలను ఆదుకోవాలిరోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి రుద్రూర్, సెప్టెంబర్ 4: (E6tv NEWS: ప్రతినిధి) గ్రామంలో ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం ఆర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కుర్లెపు గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు….
జుక్కల్ చౌరస్తాలో బస్సు ప్రమాదం
డ్రైవర్ మృతి.. 12 మందికి గాయాలు బిచ్కుంద ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) జుక్కల్ చౌరస్తా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొత్తం 13 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను…
రేవంత్ కేబినెట్ రీషఫుల్: ముగ్గురు మంత్రులకు చెక్.. కొత్తగా ఎవరికి ఛాన్స్?!
హైదరాబాద్: మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ విస్తరణ, సమగ్ర పునర్వ్యవస్థీకరణకు సీఎం రేవంత్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ భారీ మార్పులు జరగనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు, సామాజిక సమీకరణలు, పనితీరు ఆధారంగా ముగ్గురు మంత్రులకు కోత విధించి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు…
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం!
హైదరాబాద్: మజ్లిస్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీల దేశభక్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల కంటే ఒవైసీ సోదరులేమీ తక్కువ దేశభక్తులు కారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన బండి సంజయ్,…
కొత్త పార్టీ దిశగా కొండా సురేఖ ముందడుగు?!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మంత్రివర్గం నుంచి గురువారం రాత్రి అనూహ్యంగా బర్తరఫ్ గురైన కొండా సురేఖ తన తదుపరి రాజకీయ అడుగుపై ఆసక్తికర సంకేతాలిచ్చారు. “వేచి చూసే సమయం ముగిసింది.. బిగ్ అప్‌డేట్ త్వరలోనే రాబోతోంది.. స్టే ట్యూన్డ్ తెలంగాణ” అంటూ ఆమె సోషల్ మీడియా (ఫేస్‌బుక్) వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయంలో సంచలనం సృష్టిస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సురేఖ మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురికావడంతో…

