Breaking News

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడు కాలే పండురంగకు శిక్ష.. రూ.5 వేల జరిమానా విధించిన ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం నిజామాబాద్, అక్టోబర్ 15 (E6tv న్యూస్: శివ ఠాకూర్). మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు కాలే పండురంగకు న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి దుర్గాప్రసాద్ తీర్పు వెలువరించారు. నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా కూడా విధించారు. 2021లో నమోదైన కేసు…..

Read Full News

బాన్సువాడలో బతుకమ్మ సంబరాలు.. 31 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు

నర్సింగ్ కళాశాల విద్యార్థినులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, అక్టోబర్ 15 (E6tv న్యూస్). బాన్సువాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీతో పాటు బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. బాన్సువాడ పట్టణానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం తన నివాసంలో మంజూరు పత్రాలను అందజేశారు. నిరుపేదల సొంతింటి కలకు మరో అడుగు.. ఇందిరమ్మ ఇళ్ల…

Read Full News

కాంగ్రెస్ అసమర్థ పాలనతో విద్యుత్, సాగునీటి సంక్షోభం

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి.. ఎస్సారెస్పీ నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ వేల్పూర్, అక్టోబర్ 15: (E6tv న్యూస్). కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన, ముందుచూపులేని విధానాలతో రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందక, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను…

Read Full News

విద్యుత్ నగర్‌లో ఘనంగా దసరా ఐక్యత గీతం ఆవిష్కరణ

శ్రీదేవి ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం.. ఆర్‌ఆర్‌ టీమ్‌కు అభినందనలు పటాన్చెరు, అక్టోబర్ 15 (E6 న్యూస్ ప్రతినిధి). దసరా పండుగను పురస్కరించుకుని ప్రజల్లో ఐక్యతా భావాన్ని పెంపొందించడంతోపాటు పండుగ విశిష్టతను చాటిచెప్పే లక్ష్యంతో రూపొందించిన ‘దసరా ఐక్యత గీతం’ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం విద్యుత్ నగర్‌లోని న్యూ ఎంఐజీ, రోడ్డు నంబర్ 10లో ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గీతాన్ని ఆవిష్కరించి, రూపకల్పనలో భాగస్వాములైన ఆర్‌ఆర్‌ టీమ్ సభ్యులను…

Read Full News

విద్యుత్‌, వ్యవసాయ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ విమర్శ ఎల్లారెడ్డి, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). విద్యుత్‌, వ్యవసాయ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ విమర్శించారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.తక్కువ వోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలతో పంటలు ఎండిపోయే పరిస్థితులు…

Read Full News

మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి తొలి అడుగు

ఆలయాన్ని సందర్శించి అంచనాల తయారీకి కొలతలు తీసుకున్న దేవాదాయ శాఖ అధికారులు బాల్కొండ, అక్టోబర్ 15: (E6 టీవీ న్యూస్). బాల్కొండ మండల కేంద్రంలో వేలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక శోభను చాటుతున్న మార్కండేయ మందిర పునర్నిర్మాణ పనులకు సంబంధించి అధికారులు తొలి అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) రమేష్, స్థపతి వెంకటేష్ ఆలయాన్ని సందర్శించారు.ఆలయంలోని విగ్రహాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించి, పునర్నిర్మాణ పనులకు…

Read Full News

బాధితురాలి వైద్య చికిత్సకు రూ. 2 లక్షల ఎల్‌ఓసీ అందజేత

జాన జమునకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచన వేల్పూర్, సెప్టెంబర్ 15: (E6 టీవీ న్యూస్). అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన జాన జమున వైద్య ఖర్చుల నిమిత్తం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ. 2 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఈ మేరకు ఎల్‌ఓసీ పత్రం కాపీని వేల్పూర్‌లో బాధితురాలి కుటుంబ…

Read Full News

పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ కుమార్ అక్రమ అరెస్టును ఖండించాలి

అరెస్టు చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలి: ఏఐకేఎంఎస్ బోధన్ డివిజన్ కార్యదర్శి సూర్య విఠల్ బోధన్, అక్టోబర్ 15: (E6 TV NEWS). పీడీఎస్‌యూ (PDSU) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) బోధన్ డివిజన్ కార్యదర్శి సూర్య విఠల్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భారత ఎన్నికల…

Read Full News

స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

నిష్పాక్షికంగా, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు శ్రీ సత్యసాయి జిల్లాలో 11.35 లక్షల మంది ఓటర్లు.. 467 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల ప్రక్రియ పుట్టపర్తి, అక్టోబర్ 15 (E6 TV NEWS). శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గురువారం పుట్టపర్తి…

Read Full News

జాతీయ స్థాయి మహిళా క్రికెట్ ఛాంపియన్‌షిప్‌కు ఉట్‌పల్లి గిరిజన ఆణిముత్యం

తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగనున్న జయ మనోజ్ఞ నాయక్‌.. గ్రామ ప్రజల్లో హర్షాతిరేకాలు నిజామాబాద్, అక్టోబర్ 15 (E6 టీవీ న్యూస్). నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉట్‌పల్లి గ్రామానికి చెందిన గిరిజన యువ క్రికెటర్ జయ మనోజ్ఞ నాయక్ జాతీయ స్థాయి మహిళా క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైంది. గ్రామానికి చెందిన రూడావత్ జయ పవన్ దంపతుల కుమార్తె అయిన మనోజ్ఞ నాయక్ తన ప్రతిభతో జాతీయ స్థాయికి ఎదగడం పట్ల గ్రామ ప్రజలు…

Read Full News