Breaking News
జమ్మికుంటలో అంగన్‌వాడీ చిన్నారులకు స్లేట్లు పంపిణీ
జమ్మికుంట, ఆగస్టు 24: (E6tv NEWS: ప్రతినిధి). కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 6వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు స్లేట్లు, స్లేట్ పెన్సిళ్లను పంపిణీ చేశారు. 6వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ స్వర్ణలతమాట్లాడుతూ.. చిన్నారుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. చిన్న వయస్సు నుంచే విద్యపై ఆసక్తి కలిగించడం ద్వారా వారి భవిష్యత్‌కు మంచి పునాది…
కోరపల్లి భూ వివాదంలో నకిలీ ఆర్‌ఓఆర్ పత్రాలపై ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్
కరీంనగర్, ఆగస్టు 24: (E6tv NEWS: ప్రతినిధి). కోరపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో నకిలీ ఆర్.ఓ.ఆర్., 13(బి), 13(సి) సర్టిఫికెట్లు సృష్టించడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వెంకటేశ్వరపల్లికి చెందిన బోయిని లావణ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.కోరపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 553/ఎలో 4 ఎకరాల 32 గుంటల భూమిని తాను కొనుగోలు చేశానని లావణ్య తెలిపారు. తన పేరుపై మ్యూటేషన్…
22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ నాయకులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సవాల్
ఇందూరు, ఆగస్టు 23: (E6tv NEWS: శివ ఠాకూర్). 22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. ఇందూరు జిల్లాలో ఎక్కడికి రమ్మన్నా తాను అక్కడికి వచ్చి చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. 22-A భూముల అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చర్చకు…
అంగన్‌వాడీ టీచర్ ప్రేమలతకు ఉత్తమ అంగన్‌వాడీ టీచర్‌గా ప్రశంసా పత్రం
ఎర్గట్ల, ఆగస్టు 23: (E6tv NEWS: T.గంగాధర్). 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఆదివారం జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎర్గట్ల మండలం తోర్తి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ ప్రేమలతకు ఉత్తమ అంగన్‌వాడీ టీచర్‌గా ప్రశంసా పత్రం అందజేశారు.అంగన్‌వాడీ కేంద్రంలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తూ, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించినందుకు గుర్తింపుగా ప్రేమలతకు ఈ ప్రశంసా పత్రాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు….
మేనూర్‌లో ఘనంగా అన్నాభౌ సాఠే 106వ జయంతి వేడుకలు
మద్నూర్, ఆగస్టు 23: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామంలో ఆదివారం సాహిత్య రత్న, లోక్‌షాహిర్ డాక్టర్ అన్నాభౌ సాఠే 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభౌ సాఠే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ అన్నాభౌ సాఠే సామాజిక సమానత్వం, దళితుల హక్కులు, కార్మికుల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని కొనియాడారు. ఆయన రచనలు, పాటలు, ప్రజా…
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి.. వ్యక్తిగత దూషణలకు తావులేదు ఎంపీ అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 23: (E6 tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కారానికి విరుద్ధమని ఆయన…
మద్నూర్ మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక
మద్నూర్, ఆగస్టు 22: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేయించి, ఆడిట్ నివేదికను సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. గత ఆర్థిక సంవత్సరంలో మండల సమాఖ్యకు రూ.5,86,413 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మద్నూర్ మండల ఎంపీడీవో పి. సాయిలు పాల్గొని మండల సమాఖ్య సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మండలంలోని మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో చేరాలని,…
పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ సిబ్బంది
మద్నూర్, ఆగస్టు 22: (E6tv NEWS: ప్రతినిధి). వన మహోత్సవంలో భాగంగా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో శనివారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 200 ఈత మొక్కలు నాటారు. బిచ్కుంద ఆబ్కారీ శాఖ, గౌడ సంఘం, గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా ఆబ్కారీ అధికారి ఈఎస్ ముకుందరెడ్డి ఆదేశాల మేరకు మొక్కలు నాటినట్లు ఎక్సైజ్ ఎస్ఐ నాగేష్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్…
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి
కామారెడ్డి, ఆగస్టు 22: (E6tv NEWS ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నవజాత శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో ప్రసవం చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటలకు స్వరూప అనే బాలింతను ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు తీవ్ర ప్రసవ నొప్పులు ఉన్నప్పటికీ వైద్యులు వెంటనే…
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్
హుస్నాబాద్: రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం నిరంకుశత్వానికి నిదర్శనమని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. శనివారం హుస్నాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ముఖ్యమైన అంశాలు & డిమాండ్లు: రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ తెలంగాణకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా…

