Breaking News

విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం.. సబ్‌స్టేషన్‌ ముట్టడి

ఏడు గంటల కరెంట్‌ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్నామని రైతుల ఆందోళన కమ్మర్‌పల్లి, అక్టోబర్ 14 (E6 TV NEWS). వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతులు విద్యుత్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రోజుకు కేవలం ఏడు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని, అది కూడా నిర్దేశిత సమయానికి…

Read Full News

నీళ్లు లేక ఎండుతున్న వరి పంట.. ట్యాంకర్లతో తడుపుతున్న రైతు

చివరి దశలో నీటి కొరతతో అన్నదాత ఆందోళన రెండు ఎకరాల సాగుకు రూ.50 వేల పెట్టుబడి.. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి సరఫరా నాగిరెడ్డిపేట, అక్టోబర్ 14 (E6 TV NEWS). పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత రైతును ఆందోళనకు గురిచేస్తోంది. వరి పంట చివరి దశకు చేరుకున్న వేళ సాగునీరు అందక పొలం ఎండిపోయే పరిస్థితి ఏర్పడటంతో ఓ రైతు పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంట తండాకు చెందిన…

Read Full News

మంచి అధికారులకు కష్టాలు తప్పవా?

రుద్రూర్‌లో వర్గపోరు.. నిబద్ధతతో పనిచేసే అధికారులకు ఇబ్బందులు తప్పవా? ఒకే పార్టీలో రెండు వర్గాలు.. పాలనపై ప్రభావం చూపుతున్నాయా? రుద్రూర్, అక్టోబర్ 14 (E6 TV News: శివ ఠాకూర్). రుద్రూర్ మండల కేంద్రంలో అధికారుల బదిలీలు, స్థానిక రాజకీయ వర్గపోరు అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసే అధికారులకు రాజకీయ విభేదాలు ఇబ్బందిగా మారుతున్నాయనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. మండలంలోని ఓ శాఖలో పనిచేసిన…

Read Full News

భైంసా ప్రాజెక్టు పరిధిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి

న్యూ ఆబాది కేటగిరీకి ఈ నెల 14న ధ్రువీకరణ.. హాజరుకాని వారికి 16న ప్రత్యేక అవకాశం భైంసా, అక్టోబరు 13 (E6tv NEWS). భైంసా ప్రాజెక్టు పరిధిలోని భైంసా, కుంటాల మండలాలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ICDS అధికారులు మంగళవారం పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్వయంగా హాజరై ధ్రువీకరణ చేయించుకున్నారు. న్యూ ఆబాది కేటగిరీ కింద అందిన 228 దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 14వ తేదీన…

Read Full News

రాయసముద్రం చెరువు వద్ద దుర్గామాతకు ఘనంగా పూజలు

అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీఆర్ఎస్ పటాన్‌చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి రామచంద్రపురం, అక్టోబర్ 13 (E6 NEWS ప్రతినిధి) రామచంద్రపురం 2,6,8వ డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువు వద్ద కొలువుదీరిన దుర్గామాతకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఐదేళ్లుగా ఇక్కడ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారు. అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్…

Read Full News

దేశమంతా ఏకం కావాలి: సీజేపీ దిప్కే పిలుపు!

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల తమను అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశారని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా నిరాకరించారని విమర్శించారు. తన నానమ్మ మరణించిన విషాద సమయంలో కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు లేదా న్యాయవాదులను సంప్రదించేందుకు అనుమతించలేదని, బలవంతంగా అరెస్టు పత్రాలపై సంతకాలు చేయించేందుకు యత్నించారని ఆరోపించారు. తమ డిటెన్షన్‌కు సంబంధించిన అసలు నిజాలు…

Read Full News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం

భిక్కనూర్‌లో ముగ్గు పోసే కార్యక్రమం ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (E6tv న్యూస్: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని భిక్కనూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు మంగళవారం భిక్కనూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో భాగంగా ముగ్గు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు.పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు,…

Read Full News

రుద్రూర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి ఏమైంది?

పదేళ్లుగా నిరుపేదల ఎదురుచూపులు.. ఎప్పటికి నెరవేరనున్న సొంతింటి కల! 150 ఇళ్లు.. 483 దరఖాస్తులు.. ఆగిపోయిన లబ్ధిదారుల ఎంపిక! అసంపూర్తి ఇళ్లకు మౌలిక వసతులు ఎప్పుడు? అర్హులకు న్యాయం జరిగేనా? రుద్రూర్, అక్టోబర్ 13 (E6tv న్యూస్: ప్రతినిధి). నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. పదేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందకపోవడంపై రుద్రూర్ మండల కేంద్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే…

Read Full News

భూమికి సమాంతరంగా ట్రాన్స్‌ఫార్మర్‌.. విద్యుదాఘాతానికి దూడ బలి!

రోడ్డు విస్తరణతో పెరిగిన ప్రమాదం.. రూ.30 వేల మూగజీవి మృతి! మరో ప్రమాదం జరగకముందే అధికారులు మేల్కొనాలి! ట్రాన్స్‌ఫార్మర్‌ ఎత్తు పెంచి.. రక్షణ కంచె ఏర్పాటు చేయాలి! ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (E6tv NEWS:ప్రతినిధి). రోడ్డు విస్తరణతో రహదారి ఎత్తు పెరిగింది.. అదే ట్రాన్స్‌ఫార్మర్‌ ఇప్పుడు ప్రమాదానికి చిరునామాగా మారింది! అధికారుల అప్రమత్తత లోపించిందా? భద్రతా చర్యలు ఎక్కడ? అన్న ప్రశ్నలు దేవునిపల్లి గ్రామంలో వ్యక్తమవుతున్నాయి. ఎల్లారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి గ్రామ గేటు సమీపంలో పోచారం ప్రధాన…

Read Full News

జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తల అరెస్ట్

జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన ప్రదేశంగా (Protest Site) రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ కార్యకర్తలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్, అజింక్య షిండే తదితరులు భద్రతా వలయాలను ఛేదించి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన ముఖ్యాంశాలు:

Read Full News