Breaking News
శాలపల్లి వద్ద కారు బోల్తా: యువకుడు అక్కడికక్కడే మృతి
హుజూరాబాద్–జమ్మికుంట ప్రధాన రహదారిపై హుజూరాబాద్ మండలం శాలపల్లి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపు తప్పిన కారు, రోడ్డు పక్కన ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, ఆపై ఒక ఇంటి గోడను బలంగా గుద్ది బోల్తా పడింది. ప్రమాద స్థలాన్ని సీఐ కరుణాకర్, ఎస్సై శ్రీనివాసరావు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కారు అదుపు తప్పడానికి అతివేగమే కారణమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం: త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు!
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులను ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. రాజ్యాంగ సవరణకు మూడింట రెండొంతుల (కనీసం 360 మంది ఎంపీల) ప్రత్యేక మెజారిటీ అవసరం కావడంతో, ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్‌సభలో వీగిపోయిన ఈ బిల్లులను ఈసారి ఎలాగైనా నెగ్గించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్‌తో విభేదించి ఇండియా కూటమి…
పోటీకి మేము సిద్ధం.. స్టార్లింక్కూ ఆహ్వానం:రిలయన్స్ వ్యాఖ్యలు!
శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విభాగంలో ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ సహా ఏ సంస్థతోనైనా పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. భారత మార్కెట్లో పోటీకి తాము ఎప్పుడూ భయపడబోమని, ప్రవేశించే దేశీయ మరియు విదేశీ కంపెనీలన్నింటికీ దేశంలో ఒకే రకమైన నిబంధనలు, చట్టాలు వర్తిస్తాయని వెల్లడించింది. భారత్‌లో స్టార్‌లింక్ వాణిజ్య సేవల నిర్వహణకు ఎదురవుతున్న అనుమతుల జాప్యంపై ఇటీవల ఎలాన్ మస్క్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుని ‘ప్రధాని…
పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి పన్ను సవరణ.. కొత్త టాక్స్‌లు ఇవే!
కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి సుంకం (ఎక్స్పోర్ట్ డ్యూటీ) రేట్లలో కీలక మార్పులు చేసింది. పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 0.5 నుంచి ఐదు రెట్లు పెంచి రూ. 2.5కి చేర్చగా, డీజిల్ ఎగుమతిపై లెవీని లీటరుకు రూ. 16 నుంచి రూ. 8.5కి తగ్గించింది. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతి సుంకం మాత్రం లీటరుకు రూ. 10.5 వద్దే యథాతథంగా కొనసాగుతోంది. సవరించిన ఈ నూతన రేట్లు అక్టోబర్ 16…
ప్రకృతి ఒడిలో బతుకమ్మ సందడి!
పోచారం ప్రాజెక్టు గట్టుపై పూల బతుకమ్మలు పేర్చిన చిన్నారులు.. కనువిందు చేసిన ప్రకృతి అందాలు ఎల్లారెడ్డి, అక్టోబర్ 16 (E6tv NEWS). తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేళ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద ఆహ్లాదకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రకృతి ఒడిలో పూల బతుకమ్మలను పేర్చుతూ చిన్నారులు, యువతులు సందడి చేశారు. పోచారం ప్రాజెక్టు పరిధిలోని పోచమ్మరాల్ గ్రామానికి చెందిన చిన్నారులు, యువతులు శుక్రవారం తెల్లవారుజామున ప్రాజెక్టు…
ఎత్తొండ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా కోనేరు వెంకట సుబ్బారావు
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన సన్మానం.. రైతులకు మెరుగైన సేవలు అందించాలని విజ్ఞప్తి బాన్సువాడ, అక్టోబర్ 16:(E6tv ప్రతినిధి). ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్‌గా నియమితులైన కోనేరు వెంకట సుబ్బారావును ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి సోంపూర్ పోచిరాం మాదిగ, జలయ మాదిగతో పాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సంఘరి సాయిలు, నాగరాజు మాదిగ కలిసి ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోచిరాం మాదిగ మాట్లాడుతూ, రైతులకు…
రుద్రూరులో మెగా వైద్య శిబిరం.. ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
రక్తదాన శిబిరానికి స్పందించిన పలువురు దాతలు రుద్రూరు, సెప్టెంబర్ 16 (E6 న్యూస్: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల ఆధ్వర్యంలో, గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు….
రుద్రూరు 14వ వార్డులో జటిలంగా డ్రైనేజీ సమస్య
మూడు రోజులుగా మిషన్ భగీరథ పైపు లీకేజీ.. పట్టించుకోవడం లేదని కాలనీ వాసుల ఆవేదన రుద్రూరు, అక్టోబర్ 16 (E6 న్యూస్: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలోని జవహర్ నగర్ కాలనీ 14వ వార్డులో డ్రైనేజీ సమస్య జటిలంగా మారింది. గత మూడు రోజులుగా మిషన్ భగీరథ పైపు లీకేజీ కారణంగా నీరు భారీగా ప్రవహిస్తున్నప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాలనీలో గత మూడు రోజులుగా డ్రైనేజీ…
డాక్టర్ ఎంఏ హకీమ్ సేవలు అద్భుతం.. పేదలకు అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సామాజిక కార్యకర్త
ఆడపిల్ల పుట్టిన తల్లులకు రూ.5 వేల ఆర్థిక సాయం, దుస్తులు, తల్లి కిట్ అందజేత పోతంగల్, అక్టోబర్ 16: (E6 న్యూస్ ప్రతినిధి). పేదల సంక్షేమమే లక్ష్యంగా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ ఎంఏ హకీమ్ అందిస్తున్న సేవలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పార్టీలకు అతీతంగా, కులమతాలకతీతంగా, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారని స్థానికులు కొనియాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా…
పటాన్చెరులో అండర్-17 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం
ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ పటాన్చెరు, అక్టోబర్ 15 (E6tv ప్రతినిధి). పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్-17 బాలబాలికల రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి…
