Breaking News
కరెంటు కోతల కోసమేనా ‘రైతు డిస్కమ్’?ప్రభుత్వంపై బీఆర్ఎస్ అనుమానాలు
తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా అంశం మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. రైతుల కోసం ప్రత్యేకంగా ‘రైతు డిస్కమ్’ ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 17 పై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ జీవో వల్ల భవిష్యత్తులో ఉచిత విద్యుత్ విధానానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త డిస్కమ్…
ధర్మవరం నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో అధికారుల అప్రమత్తం.. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ధర్మవరం, అక్టోబర్ 12 (E6 TV న్యూస్). ధర్మవరం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాలు, కాలనీలను గుర్తించి, తాగునీటి…
ఇది ముమ్మాటికీ ‘ఓట్ల దొంగతనమే’ :మంత్రి శ్రీధర్ బాబు
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పలువురు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎల్ నినో, కరువు పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం – హరీశ్‌రావు
తెలంగాణలో కరువు మరియు ఎల్ నినో ప్రభావంపై ముందస్తు చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రైతులతో నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ను పదే పదే మార్చడం, రద్దు చేయడం చూస్తుంటే ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు.
జంతర్ మంతర్ ఇకపై నిరసన ప్రదేశం కాదు..మూడు కొత్త వేదికలు
న్యూఢిల్లీలోని ప్రముఖ నిరసన వేదిక అయిన జంతర్ మంతర్‌ను నిరసనలు, ఆందోళనల నిర్వహణకు ఉద్దేశించిన అధికారిక జాబితా నుంచి కేంద్ర హోంమന്ത്രാత్వ శాఖ (MHA) తొలగించింది. ప్రత్యామ్నాయ ప్రదేశాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సిఫారసుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఢిల్లీ పోలీసులకు 24 గంటల టైమ్…జంతర్ మంతర్ వద్ద నిరసనకు తేదీ
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నూతన వ్యూహంతో ముందుకు వచ్చింది. శాంతియుత నిరసన ప్రదర్శన కోసం సమయం కేటాయించాలని కోరుతూ సీజేపీ నాయకులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లు సోమవారం ఉదయం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
‘ఇండియా’ కూటమి భేటీ తిరస్కరణపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
‘ఇండియా’ కూటమి నేతలు తనను కలవాలంటూ చేసిన అభ్యర్థనను తిరస్కరించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సోమవారం స్పందించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా, అలాగే ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై ప్రతిపక్ష నేతలు నిరసన మార్చ్ చేపట్టడంతో పాటు, ఈ అంశంపై విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు సీజేఐతో భేటీ కావాలని…
మాలల రిజర్వేషన్లపై రోస్టర్ పాయింట్ల సవరణకు ధర్నా
మాలల ఉద్యోగ నియామకాల్లో న్యాయం చేయాలి రిజర్వేషన్ల అమలులో మార్పులు చేపట్టా అక్టోబర్ 15న నిజామాబాద్‌లో ధర్నాకు మాల మహానాడు పిలుపు నిజామాబాద్, అక్టోబర్ 12 (E6 TV News) మాలల రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్ పాయింట్ల సవరణ చేపట్టి, ఉద్యోగ నియామకాల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ నెల 15న నిజామాబాద్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు, జిల్లా ప్రెసిడెంట్ దేవదాస్ ప్రకటించారు. గురువారం ఉదయం 10 గంటలకు…
వెస్టిండీస్‌పై 14 పరుగుల తేడాతో భారత్ సంచలన విజయం!
ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 14 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (69) అర్ధశతకంతో చెలరేగగా, ఇషాన్ కిషన్ (37) రాణించారు. అనంతరం 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను భారత బౌలర్లు కట్టడి…
Delhi Protest Live:ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి నిరసన మార్చ్…!
ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ‘ఇండియా’ కూటమి తలపెట్టిన నిరసన మార్చ్ నేపథ్యంలో న్యూఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పలు కీలక మెట్రో స్టేషన్లను మూసివేశారు. బరాఖంబ రోడ్, మండి హౌస్ ప్రాంతాల్లో ఢిల్లీ…
