Breaking News
వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికీ మొక్కల పంపిణీ
భీంగల్, ఆగస్టు 14: (E6 tv NEWS ప్రతినిధి). ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 1వ నుంచి 6వ వార్డుల్లో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మహిళలకు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ హాజరయ్యారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, 2వ వార్డు…
హల్ద్వానీ ఘటనకు నిరసనగా కామారెడ్డిలో పాదయాత్ర–సత్యాగ్రహం
కామారెడ్డి, ఆగస్టు 14: (E6 tv NEWS: ప్రతినిధి) హల్ద్వానీలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన ఘటనను నిరసిస్తూ ఆగస్టు 14న కామారెడ్డి జిల్లాలో జిల్లా స్థాయి పాదయాత్ర, సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు సంఘీభావంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, అనుబంధ సంఘాలు, విభాగాల…
గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ.. ఇద్దరు మహిళలు మృతిమరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ నిజామాబాద్, ఆగస్టు 13: (E6 tv NEWS, శివ ఠాకూర్). ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి…
అదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై విద్యార్థి యువత పోరు గర్జన
మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అదిలాబాద్ యూనిట్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో ‘విద్యార్థి యువత పోరు గర్జన’ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రధాన డిమాండ్లు మరియు ముఖ్యాంశాలు: ఈ సభలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాసిం, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సాధన…
కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు హెల్త్ కార్డు వర్తింపజేయాలి
ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు వైద్య సదుపాయాలు కల్పించాలి: టీయూడబ్ల్యూజె హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ నిజామాబాద్ ఆగస్టు 12: (E6 tv NEWS, శివ ఠాకూర్). ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు కల్పించాలని టీయూడబ్ల్యూజె హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో టీయూడబ్ల్యూజె హెచ్-143 జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ…
ఆర్మీ నియామకాల కోసం సైన్యంతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: భారత సైన్యంలో చేరేందుకు తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ఆర్మీ అధికారులతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం తెలిపారు. స్థానిక యువతలో అవగాహన పెంచి, ఆర్మీ నియామకాల్లో వారు అర్హత సాధించేలా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆయన సైనిక అధికారులకు విజ్ఞప్తి చేశారు. భారత సైనిక దళాల సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C) లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్…
నిరుపేద కుటుంబానికి అండగా జమ్మికుంట 6వ వార్డు కౌన్సిలర్
జమ్మికుంట, ఆగస్టు 12: (E6 tv NEWS: ప్రతినిధి). ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ జమ్మికుంట 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సీర్ల అనిత రాణి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె అంతిమయాత్రలో కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ పాల్గొన్నారు.హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 30 సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్న సీర్ల అనిత రాణి ప్రైవేట్ నర్సుగా పనిచేస్తూ కుటుంబాన్ని…
దివ్యాంగుల సంక్షేమంపై కేంద్ర మంత్రితో ఎంపీ అర్వింద్ భేటీ
న్యూఢిల్లీ ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి). ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్‌ను న్యూఢిల్లీలో కలిశారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, సహాయక పరికరాల పంపిణీ, ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు,…
బిచ్చుకుంద డిగ్రీ కళాశాలలో సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం
బిచ్చుకుంద, ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి). బిచ్చుకుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ప్రేమ, మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు తదితర సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, బిచ్చుకుంద ఎస్‌ఐ జి. రాజు సూచనలతో ఏఎస్ఐ డి. దేవరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్…
అంతర్‌రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు: 8 మంది అరెస్ట్, 44 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. దొంగతనాలకు పాల్పడిన ఐదుగురితో పాటు చోరీ బైకులను కొనుగోలు చేసిన ముగ్గురిని కలిపి మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు సిసిటివి (CCTV) ఫుటేజ్,…

