Breaking News
సీజనల్ వ్యాధులపై అవగాహనకు షార్ట్‌ఫిల్మ్ ఆవిష్కరణ
నిజామాబాద్ ఆగస్టు 12: E6 tv NEWS ( శివ ఠాకూర్).వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన “మన ఆరోగ్యం మన చేతుల్లోనే” అనే షార్ట్‌ఫిల్మ్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆవిష్కరించారు.గోవిందపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మానస ఆధ్వర్యంలో, ఉపాధ్యాయుడు కోకిల నాగరాజు రచించి, రూపొందించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే…
ఎయిడ్స్‌పై రెండు నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ ఆగస్టు 12: (E6 tv NEWS, శివ ఠాకూర్). హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎయిడ్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహించనున్న విస్తృత అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీ భుజంగరావు బుధవారం ప్రారంభించారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీతో కలిసి ఐఐఈసీ (Intensified Information, Education & Communication) కార్యక్రమాన్ని…
జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలు న్యాయమైనవి, సీబీఐ విచారణ జరిపించాలి: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు
హైదరాబాద్: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు పూర్తిగా న్యాయమైనవని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బుధవారం అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ లీకేజీ వ్యవహారాన్ని వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జార్ఖండ్ విద్యార్థుల ఉద్యమం వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదని,…
ఇథనాల్ అంశంపై కాంగ్రెస్, కేజ్రీవాల్‌లకు కిషన్ రెడ్డి ఘాటు కౌంటర్
హైదరాబాద్: ఇథనాల్ బ్లెండింగ్ (పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం) ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న విమర్శలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ (UPA) ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ల కాలక్రమాన్ని (Chronology) బయటపెడుతూ వారిపై నిప్పులు చెరిగారు. ఇథనాల్ బ్లెండింగ్‌పై రాహుల్ గాంధీ దేశ ప్రజలకు “అబద్ధాలు” చెప్తున్నారని, విదేశీ దిగుమతులపై…
మధిర మున్సిపల్ ఆఫీస్‌ను ముట్టడించిన బిఆర్‌ఎస్ నాయకులు
ఖమ్మం / మధిర: పట్టణంలోని పలు కాలనీల్లో నెలకొన్న పారిశుధ్య లోపం, ప్రాథమిక వసతుల కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్లకార్డులు చేతబూని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను ఉద్దేశించి బిఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ లింగాల కమల్ రాజ్ మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలలో చెత్తాచెదారం పేరుకుపోయి, పారిశుధ్యం…
భీమ్‌గల్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ
భీమ్‌గల్, ఆగస్టు 12: E6 tv NEWS(T. గంగాధర్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భీమ్‌గల్ పట్టణంలో మంగళవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని సుదర్శన్ థియేటర్ నుంచి సుమంగళి చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజలు, యువత, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతో పాటు శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల, శ్రీ నారాయణ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….
CEIR పోర్టల్‌తో 8 సెల్‌ఫోన్లు రికవరీ
యజమానులకు ఫోన్లు అందజేసిన భీంగల్ పోలీసులు భీంగల్, ఆగస్టు 11: E6 tv NEWS (T. గంగాధర్).భీంగల్ మండల పరిధిలో ఇటీవల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి రికవరీ చేశారు. మొత్తం 8 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని సంబంధిత యజమానులకు అందజేశారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు లేదా దరఖాస్తు చేయాలని పోలీసులు సూచించారు. ఫోన్ వివరాలను CEIR…
ప్రతీ బిడ్డకు ప్రపంచస్థాయి విద్యే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఇళ్లు నిర్మించడం సులభమే, కానీ కలలకు పునాది వేయడానికి ప్రభుత్వానికి బలమైన సంకల్పం కావాలని, ఆ దృఢ సంకల్పంతోనే తెలంగాణలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ రూపుదిద్దుకుంటున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలకు స్వస్తి పలుకుతూ.. కులం, మతం, ప్రాంతం మరియు కుటుంబ నేపథ్యాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి బిడ్డకు ప్రపంచస్థాయి విద్యను అందించడమే తమ…
అభిమానంతో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర
మద్నూర్ మీదుగా తమిళనాడుకు వెళ్తున్న మహారాష్ట్ర అభిమాని యాదవ్ హెగ్డోలే మద్నూర్ ఆగస్టు 11: (E6 tv NEWS: M. మస్నాజీ).తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ దళపతి పట్ల ఉన్న అభిమానంతో మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని సుమారు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలోని దెగ్లూర్ మండలం షెల్గవ్ గ్రామానికి చెందిన యాదవ్ హెగ్డోలే తన అభిమాన నాయకుడిని స్వయంగా కలిసి అభినందించాలనే ఆశయంతో పాదయాత్రగా తమిళనాడు బయలుదేరారు. విజయ్ దళపతి ముఖ్యమంత్రి…
మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. 40 కేసులు నమోదు
20 మంది అరెస్ట్.. గుడుంబా, అక్రమ మద్యం సీజ్రాబోయే వారం స్పెషల్ డ్రైవ్: DPEO అరుణ్ కుమార్ నిజామాబాద్, ఆగస్టు 11: (E6 tv NEWS: శివ ఠాకూర్).మత్తు పదార్థాల వినియోగం, అక్రమ విక్రయాలు, రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు DPEO పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్, మోర్తాడ్ ప్రాంతాలతో పాటు DTF, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 40 కేసులు నమోదు…

