Breaking News
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి భారీగా తరలిరావాలి
మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ).మద్నూర్ మండల ప్రజలందరికీ పెద్ద ఎక్వొర సర్పంచ్ సోమర్ మహేష్ ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారి కుమార్తె వివాహ వేడుక ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు. కందర్‌పల్లి DBL సమీపంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మద్నూర్ మండల ప్రజలు పెద్ద…
అన్నాభావు సాథే విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై మాదిగ నాయకుల చర్చ
మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ)హాసన్ టాక్లి గ్రామంలో ఈ నెల 30వ తేదీన సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాథే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాదిగ జాతి ముద్దుబిడ్డ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరుకానున్న నేపథ్యంలో ఉమ్మడి మద్నూర్ మండలానికి చెందిన మాదిగ నాయకులు హాసన్ టాక్లి గ్రామాన్ని సందర్శించి కార్యక్రమ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్, గ్రామస్థులతో సమావేశమై విగ్రహావిష్కరణ, సభ,…
టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా గులని సాయిలుకు ఘన సన్మానం
బిచ్కుంద, ఆగస్టు 9: (E6 tv NEWS ప్రతినిధి).టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన గులని సాయిలును బిచ్కుందలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన గులని సాయిలు టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకం సామాజిక వర్గానికి మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదపడుతుందని…
ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం ఇందూరు యువత అదృష్టం: సీపీ సాయి చైతన్య
మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి 70కి పైగా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు.. 2,500 మందికి పైగా అభ్యర్థుల హాజరు నిజామాబాద్, ఆగస్టు 9: (E6 tv NEWS, శివ ఠాకూర్).ప్రజాభివృద్ధితో పాటు యువత భవిష్యత్తు కోసం కృషి చేసే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్…
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన మద్నూర్, ఆగస్టు 08: E6 tv NEWS (M, మస్నాజీ).మద్నూర్ ఏపిహెచ్‌సీ డోంగ్లీ ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల తల్లిదండ్రులకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యత, వ్యాక్సిన్‌కు అర్హత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది విద్యార్థినుల తల్లిదండ్రులకు వివరించారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన 20 మంది విద్యార్థినులకు సంబంధిత పత్రాలను…
మద్నూర్‌లో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్
కల్లు దుకాణాలు, దాబాలు, రైస్ మిల్లుల గోదాముల్లో విస్తృత తనిఖీలు మద్నూర్ ఆగస్టు 9: (E6 tv NEWS: M, మస్నాజీ) అక్రమ మద్యం విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు మద్నూర్ మండలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి (ఈఎస్) ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు మద్నూర్ ఆబ్కారీ ఎస్‌ఐ నాగేష్ తెలిపారు….
పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
బహుజనుల హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న చరిత్రను తెలుసుకోవాలి ఏర్గట్ల, ఆగస్టు 08: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్)మండల కేంద్రం ఏర్గట్లలో బహుజన ముద్దుబిడ్డ పండుగ సాయన్న ముదిరాజ్ 134వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. శివాజీ, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద స్థానిక ముదిరాజ్ సంఘం సభ్యులు పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రెండ్ల రవి,…
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య కమ్మర్‌పల్లి, ఆగస్టు 8: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్). అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య అన్నారు. శుక్రవారం కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అరకొరగా పెన్షన్లు…
మాదకద్రవ్యాలు, అక్రమ కల్లు రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం
నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా కేసుల నమోదు.. భారీగా గంజాయి, కల్లు స్వాధీనం వ్యసనాలకు దూరంగా ఉండేలా విద్యార్థులకు అవగాహన, వినియోగదారులకు కౌన్సెలింగ్ నిజామాబాద్, ఆగస్టు 8: (E6 tv NEWS, శివ ఠాకూర్).నిజామాబాద్ జిల్లాలో మాదకద్రవ్యాలు, అక్రమ కల్లు రవాణా, గుడుంబా తయారీపై ఎక్సైజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు DPEO నిజామాబాద్ పరిధిలోని వివిధ SHO పరిధుల్లో NDPS, కల్లు, గుడుంబా తదితర కేసులను నమోదు…
బాధిత వికలాంగుడికి పోలీసుల భరోసా
దాతల సహకారంతో ట్రై సైకిల్ అందజేసిన ఎస్ఐ నరేష్ హుజూర్‌నగర్, ఆగస్టు 8: (E6 tv NEWS ప్రతినిధి). ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ హుజూర్‌నగర్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని తిలక్‌నగర్ కాలనీకి చెందిన వికలాంగుడు ఇందిరాల పిచ్చయ్యకు దాతల సహకారంతో నూతన ట్రై సైకిల్‌ను అందజేశారు. పిచ్చయ్య గత నెలలో తన ఇంటి ఎదుట ట్రై సైకిల్‌ను పార్కింగ్ చేయగా, గుర్తుతెలియని వ్యక్తి వాహనంతో ఢీకొట్టడంతో అది తీవ్రంగా దెబ్బతింది. దీంతో ట్రై…

