News
వినాయక మండపం వద్ద చికెన్ ముక్కలు: సైదాబాద్‌లో ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్ (మదన్నాపేట్): పాతబస్తీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్నాపేట్లో వినాయక మండపం వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ ప్రాంతం మరియు సమీపంలోని దేవాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు చికెన్ ముక్కలు, వ్యర్థాలను పడేయడంతో స్థానికులు, హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే బీజేపీ నాయకులు, వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఘటన…
హుడా కాలనీలో ఉచిత వైద్య శిబిరం
శేర్లింగంపల్లి, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి) శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హుడా కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం గణేష్ మండపం వద్ద ఒమేగా పీఆర్కే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ వైద్య శిబిరానికి భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో హాజరై బీపీ, షుగర్, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గణేష్ మండపం వద్ద ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు, స్థానికులు…
జూరాల ప్రాజెక్ట్ ముట్టడి ఉద్రిక్తం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అరెస్ట్!
వనపర్తి/మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ‘జూరాల ప్రాజెక్ట్ ముట్టడి’ పిలుపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీ ఎత్తున రంగంలోకి దిగి బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తుగా నిర్బంధిస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని వనపర్తిలోని ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం (హౌస్…
ఏ పార్టీ బాణాన్నీ కాదు.. బహుజనుల బాణాన్ని: కవిత
కొడంగల్/కోస్గి: తాను బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌లకు సంబంధించిన ప్రతినిధిని కానని, బహుజనుల హక్కుల కోసం సంధించిన బాణాన్ని అని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బహుజనులు రాజకీయంగా అధికారాన్ని చేపట్టాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించక తప్పదని ఆమె పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో కవిత మాట్లాడారు. కవిత ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భీమ్రావు పటేల్ అంత్యక్రియల్లో పాల్గొన్న సౌదగర్ అరవింద్
జుక్కల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి) జుక్కల్ మండలం కంఠల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమ్రావు పటేల్ అంత్యక్రియలు ఆదివారం కుటుంబ సభ్యులు, బంధువులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ప్రచార కమిటీ సభ్యుడు సౌదగర్ అరవింద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా భీమ్రావు పటేల్ పార్థివదేహాన్ని మోసి అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలను…
కాంగ్రెస్ రాక్షస పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి: హరీష్ రావు
యాదాద్రి భువనగిరి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ సమస్యలను, ఇతర ప్రజా సమస్యలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ “రాక్షస పాలన” సాగిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…
పర్యావరణ హిత అభివృద్ధి వైపు అడుగులేద్దాం: ఏపీ సీఎం చంద్రబాబు
విజయవాడ: భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ రంగంలో ‘గ్రే గ్రోత్’ (కాంక్రీట్ నిర్మాణాలు) నుంచి ‘గ్రీన్ గ్రోత్’ (పర్యావరణ అనుకూల నిర్మాణాలు) వైపు వేగంగా మారాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ఏర్పాటు చేసిన పర్యావరణ అనుకూల ‘ది ఎర్త్ సెంటర్’ (The Earth Centre)ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల…
రేవంత్ పాలనలోనే పాతబస్తీకి అభివృద్ధి: వలీవుల్లా సమీర్
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీని అభివృద్ధి పథంలోకి తీసుకవస్తూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ వలీవుల్లా సమీర్ అన్నారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన మౌలిక వసతులు, వైద్యం, గృహ నిర్మాణం, రవాణా రంగాలకు సీఎం ప్రాధాన్యమిస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా సమీర్ మాట్లాడుతూ.. గతంలో పాతబస్తీని కేవలం తాత్కాలిక ఉపశమన…
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్: వాట్సాప్‌లోనే అలాట్మెంట్ పత్రాలు!
హైదరాబాద్‌లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు తెలంగాణ గృహ నిర్మాణ బోర్డు (టీజీహెచ్‌బీ) సోమవారం నుంచి అలాట్మెంట్ పత్రాలను జారీ చేస్తోంది. అర్హులైన వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నేరుగా వాట్సప్, SMS ద్వారా ఈ పత్రాలను పంపుతున్నామని, లబ్ధిదారులు టీజీహెచ్‌బీ అధికారిక వెబ్సైట్ నుంచి కూడా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. మరోవైపు, శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలో రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో…
బంగాళాఖాతంలో అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతం మరియు దాని పరిసర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మరియు విదర్భ ప్రాంతాల్లో రాగల కొన్ని రోజుల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సముద్రంలో గంటకు 55 నుండి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం…
