News
సూర్యాపేట వద్ద ప్రమాదం: కార్లోనే సజీవ దహనమైన ప్రముఖ న్యూరో సర్జన్!
హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు రోడ్డు డివైడర్ ఇనుప గ్రిల్స్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఖమ్మం మమత ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ కె. జగదీష్ (50) కారులోనే చిక్కుకుని సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ…
రుద్రూర్ గౌడ సంఘం అధ్యక్ష పదవికి మీసాల గోవింద్ గౌడ్
గీత కార్మికుల సంక్షేమం, సంఘ భవనం, యువతకు విద్యా–ఉద్యోగ అవకాశాలే లక్ష్యాలు ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి రుద్రూర్,సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి). రుద్రూర్ గౌడ సంఘం ఎన్నికలు–2026లో అధ్యక్ష పదవికి మీసాల గోవింద్ గౌడ్ పోటీ చేస్తున్నారు. గౌడ సమాజ అభివృద్ధి, గీత కార్మికుల సంక్షేమం, విద్యార్థులు, యువతకు ప్రోత్సాహం, పేద కుటుంబాలకు సహాయం, సంఘానికి సొంత భవనం నిర్మాణం వంటి అంశాలను తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు.తనకు అవకాశం కల్పిస్తే రుద్రూర్ మండలంలోని…
నిరుపేదలకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలి
అవకతవకలు జరిగితే రుద్రూర్ సమీకృత భవనం ముట్టడి : బీఆర్ఎస్ రుద్రూర్, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన అసలైన నిరుపేదలకే కేటాయించాలని బీఆర్ఎస్ మండల ఇన్చార్జి గాండ్ల మధు డిమాండ్ చేశారు. బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ…
కొత్త బీసీ కాలనీలో సిమెంట్ రోడ్డు ధ్వంసం
భారీ లారీల రాకపోకలు, పార్కింగ్తో రోడ్డు దెబ్బతింటోందని కాలనీవాసుల ఆవేదన చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని కొత్త బీసీ కాలనీ (పరిటాల రవీంద్ర కాలనీ)లో భారీ వాహనాల రాకపోకలు, పార్కింగ్ కారణంగా నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు దెబ్బతింటోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ కమ్యూనిటీ హాల్‌కు వెళ్లే మార్గంలో వెలుగు కార్యాలయం, ఐసీడీఎస్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ మార్గంలో 2024–25 ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.30…
ప్లాస్టిక్ రహిత బాల్కొండకు స్టీల్ బ్యాంక్ ప్రారంభం
బాల్కొండ, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి) ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో బాల్కొండ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ‘ప్లాస్టిక్ రహిత బాల్కొండ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 3,000 స్టీల్ ప్లేట్లు, 1,000 స్టీల్ గ్లాసులతో స్టీల్ బ్యాంక్‌ను ప్రారంభించారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలో యువజన సంఘాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలకు గ్రామపంచాయతీ స్టీల్ బ్యాంక్ నుంచి ఉచితంగా స్టీల్ ప్లేట్లు,…
గణేష్ నిమజ్జనాన్ని రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చొద్దు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశంపై ఏలే మల్లికార్జున్ స్పందన కామారెడ్డి, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి).గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించవద్దని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించినదిగా సోషల్ మీడియాలో ఒక సందేశం ప్రచారంలో ఉందని, అందులో గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో రాజకీయ పాటలు, డ్యాన్సులు చేయడంతో పాటు వాటిని వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని, ఇందుకు నగదు, మద్యం,…
ఏఐకేఎంఎస్ నాల్గవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
రైతులు, కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య బిచ్కుంద, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలోని కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ (ఏఐకేఎంఎస్) నాల్గవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు. బిచ్కుంద మండల మార్కెట్ యార్డులో శనివారం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను…
రోస్టర్‌లో మాలలకు న్యాయం చేయాలి
అక్టోబర్ 4న హైదరాబాద్‌లో మాలల బహిరంగ సభ మద్నూర్, సెప్టెంబర్ 20: (E6tv NEWS: ప్రతినిధి) రోస్టర్ పాయింట్లలో మాలలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మాల సంఘం వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై అక్టోబర్ 4న హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ ఠాగూర్ ఆడిటోరియంలో మాలల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్నూర్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయ్యాల సంతోష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 16 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల…
మెడికల్ సీటు సాధించిన సాయి తేజ
మద్నూర్, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా ఉమ్మడి మద్నూర్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి సాయి తేజ ఎంబీబీఎస్ సీటు సాధించి ప్రతిభ చాటారు. మెడికల్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి వరంగల్‌లోని మెడికల్ కళాశాలలో అడ్మిషన్ పొందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మద్నూర్ గ్రామానికి చెందిన సంతోష్–మేఘన దంపతుల కుమారుడు సాయి తేజ మెడికల్ ప్రవేశ పరీక్షలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 866వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. అలాగే ప్రకటించిన ఫలితాల్లో…
దళిత బహుజనుల ఆశాజ్యోతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
రుద్రూరు, సెప్టెంబర్ 20: (E6tv NEWS: ప్రతినిధి) బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దళిత, బహుజన వర్గాల ఆశాజ్యోతి అని రుద్రూరు మండలానికి చెందిన దళిత, బహుజన మహిళలు పేర్కొన్నారు.బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు రుద్రూరు మండల కేంద్రం, గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విశేషంగా కృషి చేశారని వారు తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించడంలో ఆయన…
