News
పెనుగొండ రోడ్డులో వర్షపు నీరు నిల్వ
ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేయాలి: సిపిఎం నాయకులు అంకె ముత్యాలు కొత్తచెరువు, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). రాత్రి కురిసిన భారీ వర్షానికి కొత్తచెరువు పట్టణంలోని పెనుగొండ రోడ్డులో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు తెలిపారు. రోడ్డుపై నీరు నిలవడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు వృద్ధులు, స్థానిక ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పెనుగొండ రోడ్డులో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా…
రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ సెమినార్లో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు
ధర్మవరం, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). ధర్మవరం పట్టణంలోని సి.ఎన్.బి. గార్డెన్స్‌లో ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ సెమినార్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ధర్మవరానికి చెందిన మానస నృత్య కళాకేంద్రం శిష్య బృందం ప్రత్యేక కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించింది. నృత్య గురువు, మానస నృత్య కళాకేంద్రం ఫౌండర్ గౌ. ఆర్. మానస ఆధ్వర్యంలో శిష్యులు శాన్వి స్వరూప్, భావన, సంధ్య శ్రీ, కావ్యశ్రీ తమ అద్భుతమైన…
ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రాధాన్యత
రూ.40 లక్షలతో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి సవిత సోమందేపల్లి, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). పెనుకొండ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక, ధార్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. సోమందేపల్లి మండల కేంద్రంలో టీటీడీ నిధులతో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న అయోధ్య రామ మందిరానికి ఆదివారం మంత్రి సవిత భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అయోధ్యలో…
జమ్మికుంటలో ఘనంగా శ్రీ శక్తి మహిళా గణపతి హోమం
జమ్మికుంట, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు 6వ, 7వ వార్డుల పరిధిలో శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6:30 గంటలకు ప్రత్యేక గణపతి హోమం, పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మశ్రీ గొండవర్తి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్…
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడిగా పాట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
సంగారెడ్డి, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి). సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా పాట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని…
అలరించిన శిశుమందిర్ విద్యార్థుల వినాయక నిమజ్జన ఊరేగింపు
ముధోల్, సెప్టెంబర్ 20: (E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వినాయక శోభాయాత్ర నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. శోభాయాత్రను తిలకించిన పట్టణ ప్రజలు విద్యార్థుల ప్రతిభను అభినందించారు.అనంతరం పట్టణ శివారులోని చెరువు…
హుజురాబాద్‌లో రూ.15 లక్షలతో మురికి కాలువ నిర్మాణానికి శంకుస్థాపన
హుజురాబాద్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి). పట్టణంలో మురికి కాలువ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు శంకుస్థాపన చేశారు. సైదాపూర్ క్రాస్ రోడ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రూ.15 లక్షల వ్యయంతో చేపడుతున్న మురికి కాలువ నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. మురికి కాలువ నిర్మాణంతో డ్రైనేజీ…
చిత్తారి హరిబాబు హత్య కేసులో A-1 అరెస్ట్
ప్రతీకారంతోనే హత్యకు పథకం.. కత్తితో దాడిచేసిన గంధం సంతోష్ టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, మరో రెండు కత్తులు, రెండు కర్రలు స్వాధీనం నిజామాబాద్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన చిత్తారి హరిబాబు హత్య కేసులో ప్రధాన నిందితుడు (A-1) గంధం సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన సుమారు ఒకటిన్నర రోజులోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు నిజామాబాద్…
గణేష్ నిమజ్జన మార్గాన్ని పరిశీలించిన డీఎస్పీ విఠల్ రెడ్డి
శాంతియుతంగా నిమజ్జనోత్సవం నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు మద్నూర్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి). గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నిమజ్జన మార్గంలో పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ తీగలు, ట్రాఫిక్ నియంత్రణ,…
కుమార్ గణేష్ మండపాన్ని సందర్శించిన డీఎస్పీ విఠల్ రెడ్డి
గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు మద్నూర్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి) మండల కేంద్రంలోని కుమార్ గణేష్ మండపాన్ని శనివారం బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డితో పాటు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత…
