News
ఆంధ్రప్రదేశ్ స్థానిక సమరం:TDP-NDA వర్సెస్ YCP!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్లైమాక్స్‌కు చేరింది. రాష్ట్రంలోని 59 అర్బన్ లోకల్ బాడీలకు (ULBs) సంబంధించి పోలింగ్ స్టేషన్ల తుది జాబితాలు విడుదల కావడంతో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి పెద్ద సమరం కావడంతో, ఈ స్థానిక పోరులో జండా పాతేది ఎవరు? అధికార TDP కూటమినా లేక ప్రధాన ప్రతిపక్షం YSRCP నా? అనే చర్చ జోరందుకుంది. TDP-NDA కూటమికి ప్లస్ పాయింట్లు & సవాళ్లు…
కొత్తపల్లి సొసైటీ చైర్మన్ బరిలో వెనిగళ్ల సుధీర్
తండ్రి, తనయుల సేవలను గుర్తుచేసుకుంటున్న రైతులు కోటగిరి, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి)బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలోని కొత్తపల్లి సహకార సంఘం (సొసైటీ) నూతన చైర్మన్ పదవికి వెనిగళ్ల సుధీర్ పేరు రైతుల మధ్య చర్చనీయాంశంగా మారింది. గతంలో సొసైటీ అభివృద్ధికి వెనిగళ్ల కుటుంబం అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్న రైతులు.. సుధీర్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడితే సొసైటీ మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వెనిగళ్ల సుధీర్ తండ్రి స్వర్గీయ వెనిగళ్ల భాస్కర్…
కులమతాలకు అతీతంగా హిందూ–ముస్లిం భాయ్ భాయ్
ఆరో వార్డులో వినాయక చవితి వేడుకల్లో ముస్లిం సోదరుల భాగస్వామ్యం జమ్మికుంట,సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి)కులమతాలకు అతీతంగా హిందూ–ముస్లిం సోదరులంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని చాటిచెప్పేలా ఆరో వార్డు ప్రజలు మరోసారి స్నేహభావాన్ని చాటుకున్నారు. ఆరో వార్డులోని యాద ధనంజయ్ కిరాణా దుకాణం సమీపంలో కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ ఆధ్వర్యంలో మహిళల సహకారంతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వినాయక చవితి వేడుకల్లో ముస్లిం సోదరులు సైతం స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతు సహకారం అందించడం ప్రత్యేక…
వినాయక చవితి వేడుకల్లో శ్రీనివాస్ పటేల్ కుటుంబం
మద్నూర్, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి).వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనివాస్ పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి పుష్పాలు, పండ్లు, నైవేద్యాలను సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి గణేశుడికి హారతి ఇచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పటేల్ కుటుంబంలో భక్తి వాతావరణం నెలకొంది. విఘ్నాలను తొలగించి కుటుంబ సభ్యులకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు,…
వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం
రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయిమాస్కులు ధరించి దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి– మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిసెప్టెంబర్ 14: (E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ 14: (E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితి పండుగ రోజున విచారణ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేష్‌లను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.అసెంబ్లీ సమావేశాల…
ధర్మవరం పర్యటనలో మంత్రి సత్యకుమార్ యాదవ్
సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ధర్మవరం, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం పర్యటన వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలకు, ఎన్డీఏ కూటమి నాయకులు,…
భారత్‌కు తొలి గోల్డ్ సాధించిన బొమ్మదేవర ధీరజ్: అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు!
ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. మెక్సికోలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో జపాన్‌కు చెందిన జున్యా నకనిషిపై థ్రిల్లింగ్ షూట్ ఆఫ్ ద్వారా విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పురుష ఆర్చర్‌గా ధీరజ్ రికార్డు సృష్టించారు. ముఖ్య విశేషాలు:
అగ్నిపర్వతం అంచున 700 ఏళ్ల గణనాథుడు:ఇండోనేషియాలో ఆరాధన!
ఇండోనేషియాలోని తూర్పు జావాలో నిత్యం క్రియాశీలంగా ఉండే ‘బ్రోమో’ అగ్నిపర్వతం అంచున సుమారు 700 ఏళ్ల పురాతన గణేశుడి విగ్రహం కొలువై ఉంది. ప్రమాదకరమైన ఈ అగ్నిపర్వత విస్ఫోటనాల నుంచి తమ గ్రామాలు, ప్రజలను ఈ విఘ్నేశ్వరుడే కాపాడుతున్నాడని స్థానిక టెంగెరీస్ హిందూ సమాజం ప్రగాఢంగా విశ్వసిస్తోంది. విశేషాలు & సాంప్రదాయం:
నేడే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ: విశేషాలు, ప్రాశస్త్యం ఇవే!
తిరుమల కలియుగ వైకుంఠంలో వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలకు శాస్త్రోక్తంగా బీజం వేసే పవిత్ర ఘట్టం “అంకురార్పణ” సోమవారం (సెప్టెంబర్ 14) రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం జరగనుంది. అంకురార్పణ ఘట్టం & అంతరార్థం:
యుసిసిపై అమిత్ షా వ్యాఖ్యలకు ఒవైసీ ఘాటు కౌంటర్!
యూనిఫాం సివిల్ కోడ్ (UCC), ఎన్ఆర్సి (NRC) ల అమలుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2029 నాటికి ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాల్లో యుసిసిని అమలు చేస్తామని అమిత్ షా ప్రకటించడాన్ని తప్పుబట్టిన ఆయన, ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలు తాము ‘చిన్న బీజేపీ (Choti BJP)’ కాదని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. ఒవైసీ…
